Secret of Osama bin Laden: పాకిస్తాన్ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయం అని చాలా దేశాలు నినదీస్తున్నాయి. ఈ దేశంలోని కొందరు డబ్బు కోసం దేనికైనా సిద్ధం అవుతారు. అవసరమనుకుంటే దేశానికి చెందిన ముఖ్య సమాచారాన్ని కూడా ఇవ్వడానికి వెనుకాడరు అని కొందరు అంటుంటారు. అయితే ఈ విషయం అమెరికా చేసిన ఒక తప్పు లో నిరూపణ అయింది. అమెరికా చేసిన తప్పు వల్ల పాకిస్తాన్ దేశంలోని కొందరికి లక్షల రూపాయలు ఇచ్చి సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది. అలా డబ్బు ఇచ్చి సమాచారాన్ని తెలుసుకొని ఒసామా బిన్ లాడెన్ ను చంపేసింది. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా ఎప్పుడు చంపేయాలి. కానీ అప్పుడు ఒక చిన్న పొరపాటు చేసింది. ఆ పొరపాటును అమెరికాకు చెందిన మాజీ CIA ఏజెంట్ ఒకరు ఇటీవల బయటపెట్టారు. ఆ తప్పు ఏంటి? అందులో ఎలాంటి రహస్యాలు ఉన్నాయి?
అమెరికాకు చెందిన మాజీ CIA ఏజెంట్ జాన్ కిరియాకౌ అఫ్గానిస్థాన్ ఆల్కైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ గురించి ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. ఒసామా బిన్ లాడెన్ ను 2011 మే 2న అమెరికా కాల్చి చంపేసింది. అయితే అంతకంటే ముందే 2001లో ఆఫ్ఘనిస్తాన్ దేశంపై అమరికా దాడి చేసింది. ఈ దాడితో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది.. దీంతో వెంటనే అతన్ని కాల్చి చంపేద్దామని అనుకున్నాం. కానీ అప్పుడు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ నుంచి ఒక సమాచారం వచ్చింది. ఈ చీఫ్ పాకిస్తాన్లో ఒక ట్రాన్స్ లేటర్ నువ్వు అపాయింట్ చేశారు. అయితే ఈ ట్రాన్స్లేటర్ అమెరికా చీఫ్ కు ఒక తప్పుడు సమాచారాన్ని అందించాడు. అదేంటంటే ఒసామా బిన్ లాడెన్ ఉన్న కొండపై దాడి చేస్తే అమాయకమైన మహిళలు మరణిస్తారని… అందువల్ల సాయంత్రం వరకు మహిళలు వెళ్లిపోతారని అప్పుడు దాడి చేయడం వల్ల ఒసామా బిన్ లాడెన్ మాత్రమే చనిపోతాడని ఆ ట్రాన్స్లేటర్ అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ కు తెలిపాడు. ఇది నమ్మిన సెంట్రల్ కమాండ్ సాయంత్రం వరకు కాల్పులు జరపొద్దని ఆదేశాలు జారీ చేసింది.
కానీ వాస్తవానికి అలా సాయంత్రం వరకు ఆగాలని చెప్పింది ఎందుకు అంటే.. అప్పటివరకు ఒసామా బిన్ లాడెన్ ను బుర్కావేశంలో తప్పించడానికి. ఈ సమయంలో వస్తామా బిన్ లాడెన్ బుర్కా వేసుకొని అక్కడి నుంచి ఒక ట్రక్కులో కూర్చొని తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో కుసామా బిన్ లాడెన్ ను చంపేందుకు ఆస్కారం లభించలేదు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒసామా బిన్ లాడెన్ గురించి సమాచారం తెలుసుకోవడానికి.. పాకిస్తాన్లోని కొందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అలా పది సంవత్సరాలపాటు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చింది.. అని సిఐఏ ఏజెంట్ తెలిపారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే తమ దేశ సమాచారం ఇవ్వడానికి పాకిస్తాన్లోని కొందరు ఎంతటికైనా తెగిస్తారు.. అని దీనిని బట్టి తెలుస్తోంది.