https://oktelugu.com/

భారత బలగాలను చూసి పాక్‌ సైన్యం, అధికారులు వణికిన వేళ..

జమ్మూలోని పుల్వామాలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది ఆర్మీ సైనికులను బలయ్యారు. దీనికి ప్రతీకగా భారత్‌ బాలకోట్‌పై సర్జికల్‌ దాడి చేసింది. ఈ దాడిలో పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేశాయి నియంత్రణ రేఖ నుంచి కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయడంతో జైసే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పూర్తిగా మట్టుబెట్టింది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ ఆ సమయంలో ఇది పాక్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 03:24 PM IST
    Follow us on

    జమ్మూలోని పుల్వామాలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది ఆర్మీ సైనికులను బలయ్యారు. దీనికి ప్రతీకగా భారత్‌ బాలకోట్‌పై సర్జికల్‌ దాడి చేసింది. ఈ దాడిలో పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేశాయి నియంత్రణ రేఖ నుంచి కిలోమీటర్ల దూరంలోని బాలకోట్‌ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయడంతో జైసే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పూర్తిగా మట్టుబెట్టింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఆ సమయంలో ఇది పాక్‌ పనేనని భారత్‌ వాదించగా అక్కడి ప్రభుత్వం స్పందించలేదు. అయితే తాజాగా ఇది తమ పనేనని పాకిస్థాన్‌కు చెందిన ఓ మంత్రి ప్రకటించడం వివాదంగా మారింది. దీనికి ప్రతిస్పందించిన నాటి భారత్‌ వైమానిక దళపతి బిఎస్‌ ధనోవా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    Also Read: పోలవరం ఇంకో ‘ప్రత్యేక హోదా’ లాగా మారబోతుందా?

    బాలకోట్‌లోని ఉగ్రవాద సంస్థపై దాడికి పాక్‌ స్పందించి ఉంటే దాయాది సైనిక విభాగాల్ని తుడిచిపెట్టేందుకు భారత సేనలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నాటి వైమానిక దాడుల్లో పాక్‌కు బందీగా పట్టుబడిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు వణికిపోయారన్నారు. ఆ సమయంలో వర్దమాన్‌ను అప్పగించడం తప్ప పాక్‌కు మరో అవకాశం లేదన్నారు.

    Also Read: మరో ముందడుగు వేసిన భారత్‌

    భారత బలగాలను చూసి పాక్‌ విపరీతంగా వణికిపోయిందని, పాక్‌పై రాజకీయపరంగా, దౌత్యపరంగా తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. బాలకోట్‌ దాడి తరువాత పాక్‌ కనుక భారత్‌పై దాడి చేస్తే పాక్‌ స్థావరాల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. అభినందన్‌ అప్పగింతకు ముందు ఇస్తామాబాద్‌లో నెలకొన్న ఆందోళనను పీఎంఎల్‌ఎన్‌ నేత సర్దార్‌ అయాజ్‌ సాదిఖ్‌ తాజాగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో బయటపెట్టారు. అభినందన్‌ విడుదలకు ముందు నిర్వహించిన అత్యున్నత స్థాయి బేటిలో నేతల కాళ్లు వణికిపోయాయన్నారు.