Mudragada Letter: ‘రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షంతో తడిసిపోయింది. దీంతో తడిసిన వడ్లను ప్రభుత్వాలు కొనమంటున్నాయి. మరి రైతులు ఏం చేయాలి..? తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక.. ఆదాయం రాక కొందరు రైతులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకు ఇలా చేయండి….’ అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాదం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. తాను సూచించిన కొన్ని పద్ధతులు పాటించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చన్నారు.

ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కాపు ఉద్యమం నడిపిన ముద్రగడ పద్మనాభం ఆ తరువాత ఇటీవలే వార్తల్లోకి వచ్చారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై ఆయన మాసీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఆయన తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులకు రైతులను ఆదుకునే ఉపాయాన్ని సూచించారు. తనుకు ఓ మిత్రుడు ఇచ్చిన సలహానే ఇప్పుడు పాటిస్తున్నానని చెప్పారు. ఇంతకీ ముద్రగడ రాసిన లేఖలో ఏముందంటే..?
‘దేశానికి వెన్నెముక వంటి వారు రైతులు. ఇప్పుడు ఆ వెన్నుముకే తుఫాన్లలో కొట్టుకుపోతుంది. అధిక వర్షాలకు విరిగిపోయి మట్టిలో కొట్టుకుపోతుంది. ఆ వెన్నెముకను కాపాడడానికి అందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఎవరూ సంతోషాన్నివ్వలేకపోతున్నారు.
. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షంలో రైతులు పండించిన పంటంతా కొట్టుకుపోవడమే కాకుండా ఉన్న పంట తడిసిపోయింది. అయితే తడిసిన ధాన్యం రైతులను ఆదుకోవడానికి నాదోక చిన్న సలహా. ఈ సలహాను నాకు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణగారు ఇచ్చారు.’
‘మొలాసిస్ నుంచి ఆర్ఎస్( స్పిరిట్) తీసి సారాకు, బ్రాంది, విస్కీ, హాస్పిటల్ అవసరాలకు వాడుతున్నారు. అలాగే పాడైపోయిన ధాన్యం నుంచి బియ్యం తయారు చేసి, కర్రెపెండలం నుండి ఆర్ఎస్ చేయొచ్చని సత్యనారాయణ గారు చెప్పగానే నేను అధికారులకు ఆ విధంగా చేయాలని చెప్పా. ఆర్ఎస్ తీసే డిస్టరీలను తయారు చేయాలని అప్పట్లో అధికారులను కోరాం. ఆ కాలంలో ఇలాండి డిస్టలరీలో తెలంగాణలో ఒకటి, ఆంధ్రలో ఒకటి ఉండేది. ఇప్పుడు అలాంటి మిషనరీలు తయారు చేసి కర్రపెండలం నుంచి ఆర్ఎస్ విధానాన్ని చేపడితే తడిసిన ధాన్యం వృథా కాకుండా ఉంటుంది.’
Also Read: సాయం కొందరికేనా.. సామాన్యులపై వివక్ష ఎందుకు?
‘అలాగే ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రతి జిల్లాకు ఒక డిస్టలరీలు ఏర్పాటు చేస్తే రైతులు చిరు వ్యాపారులుగా మారే అవకాశం ఉంది. ఆ సందర్భంలో మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ డిస్టలరీలు ఏర్పాటు చేయలేకపోయా. కానీ ఇప్పుడు మీరు వాటిని ప్రవేశపెడితే రైతులు నష్టపోకుండా ఉంటారని అనుకుంటున్నా..’ అని పద్మనాభం తన లేఖలో రాశారు.
ఏపీతో పాటు తెలంగాణలోనూ రైతులు తడిసిన ధాన్యంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడ ఏర్పడిన ధాన్యం కొనుగోళ్ల వివాదంతో రైతుల ధాన్యం కళ్లాల్లోనే మగ్గుతోది. ఈ క్రమంలో అకాల వర్షాలతో ఆ ధాన్యమంతా తడిసిపోతుంది. ఈ పరిస్థితిని గమనించిన ముద్రగడ తన సలహాను తీసుకోవాలని తెలంగాణ సీఎంను కూడా కోరారు. మరి ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల సీఎంలు ముద్రగడ లేఖపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also Read: కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు కేసీఆర్ పైఎత్తులు.. డైలామాలో జాతీయ పార్టీలు