Paddy Issue: ధాన్యం సేకరణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ లబ్ధిపొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ పోస్టులు చేయడం సంచలనం అవుతోంది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని పేర్కొంటూ విమర్శలు చేశారు. దీంతో కవిత చేసిన ట్వీట్ పై చురకనంటించినట్లు అయింది. ఏదో సానుభూతి పొందాలని కవిత భావించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నా అవేమీ పట్టించుకోవడం లేదు.

టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో కాలయాపన చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేంద్రం, టీఆర్ఎస్ రెండు దొందూ దొందే అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను కవిత కావాలనే స్పందిస్తూ నాటకాలు ఆడుతున్నారన్నారు.
Also Read: CM KCR Paddy Issue: ఒక్క సంతకంతో రైతుల మెడకు ఉరి తాడు వేసిన కేసీఆర్
ఎఫ్ సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకాలు చేసి ఇప్పుడు అదే అంశాన్ని రాజకీయం చేస్తూ నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ఆవేదన అర్థం చేసుకున్న రాహుల్ గాంధీకి రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ల వైఖరిపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.ప్రతి ధాన్యం గింజ కొనాలని డిమాండ్ చేయడం తెలిసిందే.

రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం దూరం కావడంతో మళ్లీ దక్షిణాదిలో కూడా పట్టు సాధించాలనే తపనతోనే రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న అంశం కావడంతోనే దీనిపై రాహుల్ ట్వీట్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Arvind Kejriwal on The Kashmir Files: గొప్ప సినిమాను రాజకీయం చేస్తే ఎలా ?
[…] […]
[…] CM YS Jagan: జగన్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోర్టు కేసులే. ఎందుకంటే ఏ రాజకీయ నేతకు లేనన్ని కేసుల గొడవలు జగన్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సీఎం అయిన తర్వాత కూడా ఆయనకు కోర్టు కేసుల టెన్షన్ వదలట్లేదు. కాగా 2014లో జగన్ మీద ఓ కేసు నమోదైంది. అప్పట్లో తెలంగాణలోని హుజూర్ నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా జగన్ రోడ్ షో చేశారనే కేసు ఇప్పటికీ నడుస్తోంది. […]
[…] MLA Rajaiah: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం దళితబంధు. ప్రస్తుతం విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే హుజురాబాద్ లో ఎమ్మెల్యేల అనుచరులకే వర్తింపజేశారనే అపవాదును మూటగట్టుకున్న ప్రభుత్వానికి తాజాగా మరో అప్రదిష్ట ఆపాదించింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు సర్పంచ్ సురేష్ కుమార్ కు దళితబంధు పథకం వర్తింపజేయడం వివాదాస్పదమవుతోంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన పథకంలో ప్రజాప్రతినిధులకు ఎలా స్థానం ఉంటుందనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. […]