RRR 4th day Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ బాలీవుడ్ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయినా.. రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్ పండితులు కూడా నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే..
ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. మరి నాలుగో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
Also Read: Senthil Kumar: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు తేడా అదేనట?
నైజాం 61.50 కోట్లు
సీడెడ్ 31.70 కోట్లు
ఉత్తరాంధ్ర 17.62 కోట్లు
ఈస్ట్ 09.62 కోట్లు
వెస్ట్ 08.57 కోట్లు
గుంటూరు 12.43 కోట్లు
కృష్ణా 09.16 కోట్లు
నెల్లూరు 05.38 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని నాలుగు రోజులకు గానూ 155.98 కోట్లు కలెక్ట్ చేసింది.
తమిళ నాడు : 18.77 కోట్లు
కేరళ : 05.28 కోట్లు
కర్ణాటక : 22.17 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) : 45.42 కోట్లు
ఓవర్సీస్ : 63.15 కోట్లు
రెస్ట్ : 04.91 కోట్లు
మొత్తం నాలుగు రోజులకు గానూ టోటల్ వరల్డ్ వైడ్ గా 315.58 కోట్లు కలెక్ట్ చేసింది.

ఒక తెలుగు సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. నాలుగో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఇలాంటి భారీ మల్టీస్టారర్ సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది.
ఇక అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.498 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నేటి వరకు చూసుకుంటే.. ఈ చిత్రం రూ.315.68 కోట్ల భారీ షేర్ ను సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.560 కోట్లను కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ సినిమాకి భారీ లాభాలు రాబోతున్నాయి.
Also Read: NTR Emotional Letter: ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్.. ఎవరి గురించి ఏమి చెప్పాడంటే ?
Recommended Video:
[…] […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కారు యోచిస్తోంది. […]
[…] KGF Chapter 2 Trailer Records: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ సంచనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను , తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను , మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. […]
[…] Alia Bhatt Unfollowed Rajamouli On Instagram: ఆలియా భట్ కి హిందీ లోకంలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఆమె నేటి మహానటిలా హిందీ ప్రేక్షకులు ఆమెను భావిస్తారు. దానికి తగ్గట్టుగానే తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా హిందీ సినీ హృదయాలను ఆకట్టుకుంటూ వస్తోంది ఆలియా భట్. ఎలాగూ గొప్ప నటనా చాతుర్యం ఉంది, బలమైన సినీ నేపథ్యం ఉంది. […]