https://oktelugu.com/

KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?

KCR vs Governor: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య పొరపొచ్చాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ చెబుతుంటే రాజ్యాంగ బద్ధంగా కాకుండా ఏకపక్షంగా ఆమె వ్యవహారాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో కొద్ది రోజులుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు మధ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో విమర్శలే వస్తున్నాయి. దీనిపై మరో పార్టీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2022 / 04:55 PM IST
    Follow us on

    KCR vs Governor: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య పొరపొచ్చాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ చెబుతుంటే రాజ్యాంగ బద్ధంగా కాకుండా ఏకపక్షంగా ఆమె వ్యవహారాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో కొద్ది రోజులుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు మధ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో విమర్శలే వస్తున్నాయి.

    owaisi, Governor

    దీనిపై మరో పార్టీ కూడా జతకలిసి టీఆర్ఎస్ కు చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గవర్నర్ విషయంలో ఓ బాంబు పేల్చారు. రాజ్ భవన్ లో పీఆర్వోను బీజేపీకి చెందిన వ్యక్తిని ఎలా నియమించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీంతోనే టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ను టార్గెట్ చేసుకుందని చెప్పడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ కు వంత పాడేందుకు ఓ అండ దొరికినట్లు అయింది. కానీ నిజానికి గవర్నర్ పై టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందని పలువురు వాదిస్తున్నారు.

    Also Read: RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !

    వీరి వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా టీఆర్ఎస్ ను తప్పుబడుతున్నాయి. మహిళను అవమానించడం టీఆర్ఎస్ కు సబబుకాదని హితవు పలుకుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మొండిగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం. రామాయంపేట ఘటనలపై గవర్నర్ నివేదిక కోరగా దీనిపై టీఆర్ఎస్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే అధికార పార్టీకి గవర్నర్ కు మధ్య విభేదాలు పెరిగినట్లు సమాచారం.

    KCR vs Governor

    టీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వ్యవహారంలో ప్రతిపక్షాలు మాత్రం గవర్నర్ పక్షం వహిస్తున్నా ఎంఐఎం మాత్రం టీఆర్ఎస్ కు వంత పాడటంతో ఇక ఈ కథ ఎందాకా వెళ్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన గవర్నర్ ను రాజకీయ పార్టీ లక్ష్యంగా చేసుకుని వివాదాల్లోకి లాగడం ఇదే తొలిసారి. బీజేపీ పై ఉన్న కోపంతో గవర్నర్ ను టార్గెట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వీరి పంచాయితీ ఎంత దకా వస్తుందో అని అందరు ఆలోచనలో పడ్డారు.

    Also Read:Samantha Sweet Warning To Naga Chaitanya: నాగ చైతన్య కి సమంత స్వీట్ వార్నింగ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్

    Tags