https://oktelugu.com/

RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !

RRR OTT: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మొత్తానికి ఫారిన్ వెర్షన్లు కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుండటం విశేషం. బాహుబలి సినిమా పుణ్యమా అని ఆర్ఆర్ఆర్ కి విదేశాల్లో కూడా ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 23, 2022 / 04:40 PM IST
    Follow us on

    RRR OTT: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మొత్తానికి ఫారిన్ వెర్షన్లు కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుండటం విశేషం.

    RRR OTT

    బాహుబలి సినిమా పుణ్యమా అని ఆర్ఆర్ఆర్ కి విదేశాల్లో కూడా ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. అందుకే, విదేశీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగు ఓటీటీ రైట్స్ ను జీ5 వారు కొనుగోలు చేశారు. మరి జీ5 లో ఈ 1000 కోట్ల సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది ? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జూన్ 3 నుంచి అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కాబోతుంది.

    Also Read: Star Heroine: ప్రియుడు మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న నెంబర్ వన్ హీరోయిన్ !

    మొత్తానికి ఈ సినిమాను మే 25వ తేదీన గానీ, లేదా జూన్ తొలివారంలో గానీ స్ట్రీమింగ్ చేయబోతున్నాయి ఓటీటీ సంస్థలు. ఐతే జీ5 వారు ఈ చిత్రాన్ని హిందీలో తప్ప మిగతా అన్నీ బాషలలోను విడుదల చేయబోతున్నారు. సినిమా రిలీజ్ అయిన దాదాపు 68 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. నిజానికి ముందే రిలీజ్ అవ్వాలి. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం టీమ్.. థియేట్రికల్ రిలీజ్ కు, డిజిటల్ రిలీజ్‌కు చాలా గ్యాప్ తీసుకున్నారు.

    RRR

    ఏది ఏమైనా నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ భారీ విజయాన్ని అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 501.74 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే.. పదో రోజు నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాలు కింద లెక్కే. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. అసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ప్రపంచ సినీ లోకమంతా షాక్ అయిపోయింది.

    Also Read:Akhanda Part 2: అఖండ పార్ట్ 2 కి అంత రెడీ.. కానీ దానికి ముందే మరో ట్విస్ట్ ఇవ్వనున్న బోయపాటి శ్రీను

    Recommended Videos:

    Tags