Homeజాతీయ వార్తలుకరోనా విలయ తాండవం.. 1341 మరణాలు

కరోనా విలయ తాండవం.. 1341 మరణాలు

Over 2.34 Lakh Corona Cases, 1,300 Deaths in Last 24 Hoursదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మూడో రోజు కూడా అదే వరుస కొనసాగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95 లక్షల టెస్టులు చేయగా.. 2,34,692 కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దంతో ఇప్పుడు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది.

కొత్తగా 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220కి చేరింది. మొత్తంగా రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది. మరోవైపు .. దేశంలో మరణాలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజులుగా రోజుకు వెయ్యికి పైగా మంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా.. 1341 మంది వైరస్‌తో పోరాడుతూ చనిపోయారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. మొదటి దశ కోవిడ్‌లో సెప్టెంబరులో ఒకరోజు అత్యధికంగా 1200 మంది చనిపోయారు. మొత్తంగా ఇప్పుడు దేశంలో కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 1,75,649కి చేరింది. అంతేకాదు.. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక.. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దేశంలో వేగవంతం చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. శుక్రవారం మొత్తంగా 30.04 లక్షల మందికి పైగా టీకా వేయగా.. ఇప్పటివరకు టీకా తీసుకున్న వరి సంఖ్య 11.99 కోట్లకు చేరుకుంది.

మరోవైపు.. మహారాష్ట్రలో మహా స్పీడ్‌లో కరోనా వైరస్‌ దూసుకెళ్తోంది. నిన్న ఒక్కరోజు 61,695 కేసులు వచ్చాయి. 349 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అటు ఢిల్లీలోనూ 16,699 కేసులు నమోదు కాగా.. 112 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ప్రధాని మోడీ సమీక్షించారు. డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం షిఫ్టుల వారీగా పనిచేయాలని కోరారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper