AP BJP: బిజెపికి ఔట్ సోర్సింగ్ బాధ

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. తన కొత్త టీమును సైతం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎప్పటినుంచో ఉన్న బిజెపి నాయకులను విస్మరించారన్న టాక్ ఉంది. సొంత సామాజిక వర్గం నాయకులకు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 29, 2023 6:20 pm

AP BJP

Follow us on

AP BJP: తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రాల నాయకత్వం మార్పిడి తర్వాత దూకుడుగా వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. రెండు చోట్ల అవుట్ సోర్సింగ్ నాయకత్వాలు నడుస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హై కమాండ్ ఒక లక్ష్యంతో కొత్త నాయకత్వాలను నియమిస్తే.. దానిని అందుకోవడంలో రెండు రాష్ట్రాల సారథులు విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. తన కొత్త టీమును సైతం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎప్పటినుంచో ఉన్న బిజెపి నాయకులను విస్మరించారన్న టాక్ ఉంది. సొంత సామాజిక వర్గం నాయకులకు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఏపీలో బిజెపి సీనియర్ నాయకులను పురందేశ్వరి కలుపుకొని వెళ్లడం లేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్య కుమార్, పాతూరి నాగభూషణం, లంక దినకర్ వంటి ఔట్సోర్సింగ్ నాయకులే పురందేశ్వరికి కనిపించడం విశేషం. చివరికి ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణకు సైతం ఆ నేతలనే తన వెంట తీసుకెళ్లి.. మిగతా నాయకులను విస్మరించారు.

అటు తెలంగాణలో సైతం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. తప్పకుండా గెలుస్తాం అన్న ధీమా నుంచి.. గట్టి పోటీ ఇస్తాం అన్నంత వరకు పరిస్థితి మారిపోయింది. అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుకున్నంత చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఈటెల రాజేందర్ మాటలు కోటలు దాటుతున్నా యే తప్ప.. కార్యాచరణ ఏది కనిపించడం లేదు. ఖమ్మంలో అమిత్ షా సభ తరువాత ప్రకంపనలు ఉంటాయని రాజేందర్ చెప్పుకొచ్చారు. కానీ తరువాత వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్న దూకుడు తెలంగాణ బిజెపిలో అస్సలు కనిపించడం లేదు. అక్కడ కూడా ఔట్సోర్సింగ్ నాయకులే హల్చల్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల బిజెపి సారథులు అనుకున్న స్థాయిలో పనిచేయలేక పోతున్నారు.