ఏకమవుతున్న విపక్షాలు.. టార్గెట్ బీజేపీ

వ్యవసాయ రంగ సంస్కరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ కలిసికట్టుగా యత్నించినా సఫలం కాలేకపోయాయి. ముజువాణి ఓటుతో బీజేపీ సర్కార్ బిల్లును ఆమోదింపజేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండటం బీజేపీకి కంటగింపుగా మారుతోంది. వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను బీజేపీ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తుండటం గమనార్హం. బీజేపీకి మంచి పట్టున్న ఉత్తరాది […]

Written By: NARESH, Updated On : September 23, 2020 12:38 am
Follow us on

వ్యవసాయ రంగ సంస్కరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ కలిసికట్టుగా యత్నించినా సఫలం కాలేకపోయాయి. ముజువాణి ఓటుతో బీజేపీ సర్కార్ బిల్లును ఆమోదింపజేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండటం బీజేపీకి కంటగింపుగా మారుతోంది.

వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను బీజేపీ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తుండటం గమనార్హం. బీజేపీకి మంచి పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లోని రైతుల నుంచి ఈ బిల్లులపై వ్యతిరేకత అధికంగా వస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్.. హర్యానా.. రాజస్థాన్. ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున పాల్గొని వారికి మద్దతు తెలుపుతున్నారు. ఈనెల 24 నుంచి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

కాగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇటీవల వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. కొద్దిరోజులపాటు అక్కడ చికిత్స తీసుకున్న సోనియా నేటి ఉదయం తిరిగి ఇండియాకు చేరుకున్నారు. సోనియాతోపాటు రాహుల్ కూడా అమెరికా వెళ్లిన సంగతి తెల్సిందే. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే సోనియా, రాహుల్ ఇండియాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది.

పార్లమెంట్ సమావేశాలు అక్టోబర్ 1వరకు జరుగాల్సి ఉంది. అయితే పలువురు ఎంపీలు, సిబ్బంది కరోనా బారిన పడుతుండటంతో కేంద్రం బుధవారం నుంచి సభను నిరవధికంగా వాయిదా వేయాలని భావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ వివాదాస్పద వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకుంటే పార్లమెంట్ సమావేశాల కొనసాగింపుపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు. ఇక రాజ్యసభలో బీజేపీ అడ్డగోలుగా బిల్లులు పాస్ చేయిచుకుంటున్నా రాష్ట్రపతి స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఈనేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడుతాయా? లేదా కొనసాగుతాయో వేచి చూడాల్సిందే..!