టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. చెప్పులు విసిరిన గ్రామస్థులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే నిరసన తగిలింది. రంగారెడ్డిలోని మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పూజలు చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాన్వాయ్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. Also Read: కవిత గెలుపుపై ఎందుకింత ప్రచారం..! కారణమేంటి? రంగారెడ్డిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుండటం వల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యేను గ్రామస్థులంతా మూకుమ్మడిగా […]

Written By: NARESH, Updated On : October 15, 2020 8:18 pm
Follow us on

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే నిరసన తగిలింది. రంగారెడ్డిలోని మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పూజలు చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాన్వాయ్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: కవిత గెలుపుపై ఎందుకింత ప్రచారం..! కారణమేంటి?

రంగారెడ్డిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తుండటం వల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై ఎమ్మెల్యేను గ్రామస్థులంతా మూకుమ్మడిగా నిలదీశారు. మంచిరెడ్డి తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలో పోతుందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు అక్కడి చేరుకొని రైతులపై అడ్డుకున్నారు. రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిపై లాఠిచార్జి చేశారు. ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరారు. పోలీసులు రైతులకు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల మధ్య ఫార్మాసిటీ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 19,333 ఎకరాలు సేకరించనుంది. ఇప్పటివరకు 10,490 ఎకరాలు సేకరించింది. మరో 8,843 ఎకరాలు సేకరించాల్సి వుంది. అయితే మేడిపల్లిలోని రైతులు తమ పట్టాభూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. ఈమేరకు రెవిన్యూ అధికారులతో గొడవలు దిగుతున్నారు.

Also Read: ఏడాది వర్షం.. ఒక్క రోజులోనే కురిసిందా! షాకింగ్ నిజాలు

కొద్దిరోజులుగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. పచ్చని పంట భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. విపక్షాలు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిరసన తగిలింది. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఏవిధంగా ముందుకెళుతారనేది వేచిచూడాల్సిందే..!