Homeఎంటర్టైన్మెంట్హాట్ బ్యూటీ దిగజారుడు పని.. పైగా నీతులు ఒకటి !

హాట్ బ్యూటీ దిగజారుడు పని.. పైగా నీతులు ఒకటి !


దిగజారుడు పనులు చేస్తూ నీతులు, సూక్తులు చెప్పడం కచ్చితంగా తప్పే. అసలు అన్నింటికంటే ముఖ్యంగా నీతులు చెప్పే మనుషుల్లో కనీసం నీతి ఉండాలి, కానీ తాజాగా ఓ హాట్ బ్యూటీ సిగరెట్ తాగుతూ తెగ నీతులు చెప్పింది. ఆ మధ్య వచ్చిన ‘నాట‌కం’ అనే ఓ బోల్డ్ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత ‘జెస్సీ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాట్ బ్యూటీ ‘అషీమా న‌ర్వా‌ల్’. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ రచ్చ చేస్తూ.. నెటిజన్లను కూడా రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా దమ్ముకొడుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మరో వియషం ఏమిటంటే.. ఈ వీడియోలో నటసింహం బాలయ్య బాబు ‘శ్రీమన్నారయణ’ సినిమాలోని ట్రబుల్ డైలాగ్‌ ను చెబుతూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. రెచ్చిపోతే మనకి వచ్చిన ఇబ్బందేమి లేదు.. కాకపోతే దమ్ము కొడుతూ నీతులను వల్లించింది.

Also Read: మహేష్ లేకుండానే ‘సర్కారువారిపాట’.. వర్కౌట్ అయ్యేనా?

పైగా ఓ మెసేజ్ చేస్తూ.. ‘నేను దమ్ముకొడుతున్నానని బాధపడకండి.. మీరు మీ కార్లు, బైకులు, ఫ్యాక్టరీలతో ప్రకృతిని కాల్చినప్పుడు, అది కూడా ఇలాగే ఫీల్ అవుతుందని..’ వీర లెవల్లో లెక్చర్ దంచింది. ఈ క్రమంలోనే ”డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్ .. ఇఫ్ యూ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్” అంటూ బాలయ్య బాబు రేంజ్ లో మస్త్ యాటిట్యూడ్ కూడా చూపించడంతో పాటు, ఆ తరువాత సిగరెట్ తాగింది. తాగి ఊరుకోలా.. స్టైల్‌ గా పొగను కూడా వదులుతూ… మీరు కూడా ఇలాగే కదా కాలుష్యాన్ని కాల్చేస్తున్నారంటూ నీతులు వల్లిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. నీతులు చెబితే చెప్పింది. మరీ సిగిరెట్ తాగుతూ చెప్పలా..?

Also Read: ‘ఆచార్య’ చిరంజీవి మౌనం.. కొరటాలకు శాపంగా మారనుందా?

ఏమిటో ఈ బ్యూటీ.. ఛాన్స్ లు లేక ఏదోకటి చేసి జనాన్ని తన వైపుకు తిప్పుకోవాలనే ఆత్రుత ఈ బ్యూటీలో బాగా కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసినందుకు ఈ బబ్లీ గర్ల్ పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ వీడియోనా పోస్ట్ చేసేది.. సిగ్గులేదా ? అసలు ఇలాంటివి పోస్ట్ చేసే ముందు కాస్త ఆలోచించాలి కదా అంటూ ఓ రేంజ్‌లో అషీమా పై ఫైర్ అవుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ‘అషీమా న‌ర్వా‌ల్’కి తెలుగులో కొత్తగా సినిమాలు అయితే రాలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version