Operation Sindoor : భారత దేశానికి చెందిన త్రివిధ దళాలు చేపట్టిన ఈ దాడిలో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 70కి మించి ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. ఇందులో మరణాలకు సంబంధించి లెక్క పూర్తిగా తేలేకపోయినప్పటికీ.. 70 కి మించి మరణాలు చోటు చేసుకున్నాయని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. అయితే చనిపోయిన వారిని ఉగ్రవాదులుగా కాకుండా.. పాకిస్తాన్ దేశస్థులుగా పాకిస్తాన్ మీడియా చెప్పడం విశేషం. మరోవైపు ఉగ్రవాద శిబిరాల పైన మాత్రమే దాడులు చేశామని.. దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఇదే విషయాన్ని అమెరికాకు సైతం నివేదించామని భారత త్రివిధ దళాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో భారత త్రివిధ దళాలు దాడులు చేయడం.. యాక్షన్ సినిమాను తలపించింది. ఏకకాలంలో దాడుల వల్ల పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
Also Read : ఉగ్రవాదులు, పాక్ సైన్యం కలిసి.. ప్రపంచానికి ఇంతకంటే ఫ్రూఫ్ ఏం కావాలి
సంచలన వీడియోలు
పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల కార్యాలయాలపై దాడులకు సంబంధించిన వీడియోలను భారత త్రివిధ దళాలు.. తమ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో మొదటి ఉగ్రవాద స్థావరంపై దాడి చేసిన దృశ్యాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ముందుగా కోట్లి ప్రాంతంలోని అబ్బాస్ ఏరియాలో ఉగ్రవాద శిబిరాన్ని భారత త్రివిధ దళాలు పేల్చేశాయి. ఇక్కడ లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఒక కేంద్రం ఉంది. దానిని ధ్వంసం చేయడానికి భారత త్రివిధ దళాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాయి. అనుకున్నట్టుగానే దాడులు మొదలుపెట్టాయి. ఆ దాడుల్లోనే ఆ కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్ యాక్షన్ సినిమాను తలపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయడంలో భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. పాకిస్తాన్ పై చేసిన దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా భారతదేశం అనేక విమానాశ్రయాలను మూసేసింది. దానికి తోడు దేశంలో పలు కీలక నగరాలకు హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సున్నిత ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నించి వదిలేస్తున్నారు. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న నగరాలలో భద్రత దళాలు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. సరిహద్దుల నుంచి పాకిస్తాన్ దేశానికి చెందిన వారు మనదేశంలోకి ప్రవేశించకుండా పకడ్బందీగా భద్రతను భారత దళాలు పర్యవేక్షిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రతి దాడికి పాల్పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్
పాకిస్తాన్ లో మొదటి ఉగ్రస్థావరంపై దాడి చేసిన దృశ్యాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ
కోట్లి వద్ద అబ్బాస్ ఉగ్రవాద శిబిరం.. లష్కరే తోయిబా (LeT) ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ధ్వంసం చేసిన విజువల్స్pic.twitter.com/UA3kfCReJa
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2025