spot_img
Homeజాతీయ వార్తలుoperation sindoor : పాకిస్తాన్‌పై భారత్ మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదుల హతం

operation sindoor : పాకిస్తాన్‌పై భారత్ మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదుల హతం

operation sindoor : పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడి నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధుర్’ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

30 మంది ఉగ్రవాదులు హతం LIVE | Operation Sindoor | India - Pakistan War Updates - TV9

బహవల్పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే లక్ష్యంగా భారత ఆర్మీ ఈ మెరుపుదాడి చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం అక్కడ 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా ధృవీకరించినట్లు సమాచారం.

పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఈ దాడులు చేసింది. ఈ దాడులు పూర్తి కచ్చితత్వంతో జరిగినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.

ప్రభుత్వ ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. తమ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో “న్యాయం జరిగింది” (#JusticeHasBeenDelivered) అని పోస్ట్ చేసింది.

మరోవైపు, భారత దాడులను పాకిస్తాన్ సైన్యం ధృవీకరించింది. అయితే, దాడుల్లో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ పేర్కొంది. భారత మీడియాలో వస్తున్న ఉగ్రవాదుల సంఖ్యపై పాక్ భిన్నమైన ప్రకటన చేసింది. తాజా పరిణామాలతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version