Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సాయుధ సంపత్తి.. ఆయుధ సామర్థ్యం ప్రపంచానికి సరికొత్తగా తెలిసింది. ఇక ఉగ్రవాద దేశం పాక్ కు ఐతే ఎన్నో విధాలుగా నష్టం జరిగింది. ఉగ్రవాద స్థావరాలు నేలకూలిపోయాయి. విలువైన జలాలు ఆగిపోయాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. తినడానికి తిండి గింజలు కరువయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే తాగడానికి కూడా ఇప్పుడు అక్కడ నీరు లేదు. దేహి అంటూ చివరికి మన పాదాల మీద పడాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలకు ఏర్పడింది. ఇప్పటికే నీటి కోసం మన దేశానికి ఉగ్రవాద దేశం అనేకసార్లు లేఖలు రాసింది. అయినప్పటికీ భారత్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఆపరేషన్ సిందూర్ మనకు అనేక ప్రయోజనాలను అందించింది. ఇందులో ఒకటి శత్రుదేశంలో దాక్కుని ఉన్న ముష్కరులను సర్వనాశనం చేయగా.. మరపక మన ఆయుధాల పనితీరు ఎంత కచ్చితంగా ఉన్నాయో ప్రపంచానికి తెలిసాయి. కేవలం ఫారిన్ కంట్రీస్ వెపన్స్ మీద ఆధారపడకుండా.. వాటికి ఇండియన్ టెక్నాలజీ జత చేయడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయిల్ నుంచి ఇండియన్ డిఫెన్స్ సంస్థ అయినటువంటి నైబీ లిమిటెడ్ కు భారీ ఆర్డర్ ఇచ్చింది. యూనివర్సల్ రాకెట్ లాంచర్లను సరఫరా చేయాలని కోరింది. ఈ ఆర్డర్ విలువ 150 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. గడచిన కొన్ని వారాలుగా నేషనల్ డిఫెన్స్ స్టాక్ పై ఇన్వెస్టర్లు ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీల్ వల్ల నైబ్ కంపెనీ షేర్ల ధర ఏకంగా 5% గ్రోత్ రిజిస్టర్ చేసింది. స్మాల్ క్యాప్ డిఫెన్స్ కంపెనీ స్టాక్ ధర ప్రస్తుతం ఒక్కొక్కటి 1602 రూపాయల వద్ద ట్రేడింగ్ సాగింది. గడిచిన 52 వారాల గరిష్ట ధర 2045 గా ఉన్న విషయం విధితమే. నైబీ సంస్థ పూణే కేంద్రంగా కార్యకలాపాల సాగిస్తోంది. 300 కిలోమీటర్ల రేడియస్ లో పనిచేయగలగే రాకెట్ లాంచర్లను తయారు చేయడం ఈ సంస్థ కున్న ప్రత్యేకత. ఈ కంపెనీ ఇజ్రాయిల్ దేశానికి రాకెట్ లాంచర్లను 2027 నవంబర్ మూడు నాటికి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ లాంచర్లను ఏ సంస్థ డెలివరీ అందుకుంటున్నదో.. ఆ వివరాలను నైబీ సంస్థ గోప్యంగా ఉంచింది. ఇక కంపెనీ రిసీవ్ చేసుకున్న ఆర్డర్ ప్రపంచ స్థాయిలో అతెంటిఫికేషన్ ఇస్తుందని.. బిజినెస్ గ్రోత్ కు ఉపయోగపడుతుందని డిఫెన్స్ వర్గాలు అంటున్నాయి. ఇక దేశంలోని మొట్టమొదటిసారిగా నైబి సంస్థ వరల్డ్ మార్కెట్లో పాగా వెయ్యడానికి హైటెక్ యూనివర్సల్ రాకెట్ లాంచర్ లు తయారు చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలలో నైబీ సంస్థ 16వేల శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. జూన్ 2020లో ఈ సంస్థ స్టాక్ ధర ఒక్కొక్కటి 9.93 గా ఉండటం విశేషం. కానీ ప్రస్తుతం అది 1600 పెరిగిపోయింది. ఇక గడిచిన నెలల కాలంలో స్టాక్ గ్రోత్ 18% పెరిగింది.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు.. అమిత్ షా