Operation Sindoor 2.0: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రస్తావరాలపై విస్తృతంగా దాడి చేసింది.. చూస్తుండగానే పాకిస్తాన్లో ఉగ్రస్తావరాలను నేలమట్టం చేసింది. రెండవ కంటికి తెలియకుండా ఉగ్రవాదుల నివాసాలను కూడా కాలగర్భంలో కలిపేసింది. భారత్ చేసిన దాడుల వల్ల సహజంగానే పాకిస్తాన్ స్పందించింది. ఎందుకంటే పాకిస్తాన్ కు, ఉగ్రవాదులతో అవినాభావ సంబంధం ఉంది. అందువల్లే ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టమైతే పాకిస్తాన్ స్పందించింది. ఒకరకంగా శోకాలు పెట్టింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాన్ని మరింత ఇబ్బందికి గురిచేసే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో సింధూ నది మీద ఒక బృహత్తరమైన హైడల్ ప్రాజెక్ట్ నిర్మించాలని భావించింది. అంతేకాదు పాకిస్తాన్ దేశానికి సింధూ నది ప్రవాహాన్ని నిలిపివేసే ప్రణాళిక కూడా విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో పాకిస్తాన్ దేశంలో హాహా కారాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అక్కడి వ్యవసాయం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. చివరికి క్రికెట్ విషయంలో కూడా పాకిస్తాన్ దేశంతో ఆడేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ద్వైపాక్షిక సిరీస్ లకు టీ మీడియా ఎప్పుడో దూరమైంది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో మాత్రమే టీమిండియా పాకిస్తాన్ జట్టుతో తలపడుతోంది. అది కూడా తటస్థ వేదికలలో మాత్రమే ఆడుతోంది.
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద కారు పేలుడుకు పాల్పడింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మొదటి నుంచి కూడా అనుమానిస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ గడ్డమీద కారు పేలుడుకు కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ 2.0 చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. భూటాన్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెబుతామని.. అటువంటివారిని ఎట్టి పరిస్థితుల్లో తాము ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆయన ఇంగ్లీషులోనే మాట్లాడారు. పైగా ఉగ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని.. వారు ఎక్కడ ఉన్నా సరే బయటికి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ ప్రకారం ఢిల్లీ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ 2.0 చేపట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ 2.0 కనక మొదలైతే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదని భారత నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.