Bihar Assembly Election 2025 Exit Polls: బీహార్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. రెండు దశలో జరిగిన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఎటువంటి హింస జరగకుండా ఎన్నికలు ముగిశాయి.. అన్ని పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ వరకు ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిచారు. ఒకరి మీద మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రెండు దశల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత బీహార్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో అనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.. ఇందులో మెజారిటీ సంస్థలు ఎన్డీఏ కూటమికి అధికారం దక్కుతుందని ప్రకటించాయి.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చేసాయి.. గెలిచేది ఆ పార్టీనే
మంగళవారం సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత పలు సంస్థలు ఎన్నికలు గెలిచే పార్టీ ఏదో వెల్లడించాయి.. పీపుల్స్ సర్వే, టైమ్స్ నౌ, ఆపరేషన్ చాణక్య ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. బీహార్ శాసనసభలో 243 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అనేక సంస్థలు వెల్లడించాయి. బీహార్ రాష్ట్రంలో బిజెపి, జెడియు (యు) ఆధ్వర్యంలోని ఇండియా కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్ సర్వేలో ప్రకటించింది.. ఎన్డీఏ కూటమి 8.3 శాతం ఓట్ల లీడ్ తో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే లో తేలింది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్ గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. తద్వారా కోటి 25 లక్షల మంది మహిళలకు 10,000 నగదు ను వారి ఖాతాలో జమ చేసింది. ఇది ఎన్డీఏ కూటమి విజయానికి దోహదం చేస్తుందని తన నివేదికలో పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ఎన్డీఏ కూటమికి 46.2, మహా ఘట్ బంధన్ కు 37.9, జన్ సూరజ్ పార్టీ కి 9.7 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది.. అంతేకాదు ఇతరులకు 6.2% ఓట్లు వస్తాయని వెల్లడించింది. అయితే ఈ సర్వే ఫలితాలలో మూడు శాతం ప్లస్ లేదా మైనస్ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు కావాలి. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమికి 133-159 , మహా ఘట్ బంధన్ కు 75-101, ఇతరులకు రెండు నుంచి 8, జన్ సురాజ్ కు 0-5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది.
టైమ్స్ నౌ సర్వేలో ఎన్డీఏ కు 135-150, మహా ఘట్ బంధన్ కు 85 -105, జన్ సూరజ్ పార్టీ కి 1, ఇతరులకు మూడు నుంచి ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది.
దైనిక్ భాస్కర్ సర్వేలో ఎన్డీఏ కు 145 నుంచి 160, మహా ఘట్ బంధన్ కు 79 నుంచి 91, జన్ సూరజ్ పార్టీ కి సున్నా, ఇతరులకు ఐదు నుంచి పది స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఎస్ ఏ ఎస్ గ్రూప్ ఎన్డీఏకు 126 నుంచి 130, మహా ఘట్ బంధన్ కు 106 మించి 110, జన్ సూరజ్ ఏడు నుంచి 10, ఇతరులకు నాలుగు నుంచి ఆరు స్థానాలు వస్తాయని తేలింది. మాట్రిజ్ సర్వేలో ఎన్డీఏకు 147 నుంచి 167,మహా ఘట్ బంధన్ కు 70 నుంచి 90 స్థానాలు వస్తాయని తేలింది.