Mahendragiri Varahi Movie Updates: అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు… డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన సక్సెస్ ఫెల్యూయార్స్ తో సంబంధం లేకుండా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన సినిమాల సెలెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సత్యం, గోదావరి, గౌరీ, గోల్కొండ హై స్కూల్, సుబ్రమణ్యపురం, మళ్లీ రావా, అనగనగా లాంటి సినిమాలతో అతనికంటూ ఒక గొప్ప ఐడెంటిటి సంపాదించుకున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక అక్కినేని ఫ్యామిలీ లాంటి పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి తను ఎప్పుడు కూడా ఆ బ్యాగ్రౌండ్ వాడుకొని ముందుకు వెళ్లాలని అనుకోలేదు. తన ఓన్ టాలెంట్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ‘మహేంద్ర గిరి వారాహి’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు… ఇప్పటికే 95% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీ నుంచి టీజర్ గాని, ట్రైలర్ గానీ వస్తే తప్ప సినిమా కథను అంచనా వేయలేము. మొత్తానికైతే థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ సినిమా ముస్తాబవుతున్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే సుమంత్ మంచి ఇమేజ్ ను సంపాదించుకొని ఒక గొప్ప పేరునైతే తెచ్చుకుంటాడు.
ఇక సినిమా చేయడం లేటైనా పర్లేదు కానీ మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న స్టార్ హీరోల కంటే తను ఏమాత్రం తీసిపోడని తన పరిధిలో ప్రేక్షకులను మేల్కొలిపే సినిమాలను చేస్తుంటాడు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి మాటలు చెప్పిన సుమంత్ ప్రస్తుతం వాటికి కట్టుబడి సమాజానికి ఉపయోగపడే సినిమాలను చేస్తున్నాడు.
రీసెంట్ గా వచ్చిన ‘అనగనగా’ సినిమాతో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల ఎలా ఉండాలి. పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం మీద ఒక అవగాహనకైతే వచ్చారు. చాలా మంది పేరెంట్స్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతుండడం విశేషం… ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమాను చూసి ఆదరించారు. అందువల్లే సినిమా మంచి విజయాన్ని సాధించింది… ఇక ఇప్పుడు మరోసారి మహేంద్ర గిరి వారాహి సినిమాతో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి సుమంత్ రెడీ అవుతుండటం విశేషం…