Operation Sindoor 2.0: పహెల్గాం ఘటన తర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. అధునాతన రఫెల్ ఫైటర్ జెట్లు, కామకాజీ డ్రోన్లు, స్టెల్త్ మిస్సైళ్లతో నిర్వహించిన ఈ దాడి ‘ఆపరేషన్ సిందూర్’గా పిలువబడింది. సరిహద్దులు దాటకుండానే ఖచ్చితమైన దాడులతో శత్రువును అవాక్కు చేసిన ఈ చర్య దేశవ్యాప్తంగా సంబరాలను రేకెత్తించింది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఆయుధాలు, రఫెల్ జెట్ల విశేషాలను తెలుసుకుందాం.
కామకాజీ డ్రోన్లు: లోయిటరింగ్ మ్యూనిషన్స్
లోయిటరింగ్ మ్యూనిషన్స్, లేదా కామకాజీ డ్రోన్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతలో విప్లవాత్మక ఆయుధాలు. ఇవి క్షిపణిలా వేగంగా దాడి చేయగలవు, డ్రోన్‌లా గాలిలో తిరుగుతూ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించగలవు. ఈ డ్రోన్లు లక్ష్యం చుట్టూ గంటల తరబడి తిరిగి, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేటర్‌కు నియంత్రణ అవకాశం ఇస్తాయి. సామాన్య పౌరులు సురక్షితంగా ఉన్నప్పుడు లేదా లక్ష్యం స్పష్టమైనప్పుడు మాత్రమే దాడి చేసేలా రూపొందించబడ్డాయి.
Also Read: పాకిస్థాన్ రహస్య ఎత్తుగడలు.. యుద్ధం కోసం యాచిస్తున్న దాయాది దేశం!
సాంకేతిక విశేషాలు
హై–రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లు: లక్ష్యాన్ని గుర్తించడం, పర్యవేక్షించడం కోసం.
రియల్–టైమ్ డేటా ట్రాన్స్‌మిషన్: ఆపరేటర్‌కు తక్షణ సమాచారం అందిస్తుంది.
స్టెల్త్ సామర్థ్యం: చిన్న పరిమాణం, తక్కువ శబ్దం, అధిక వేగం కారణంగా రాడార్లకు చిక్కవు.
రీయూజబిలిటీ: లక్ష్యం ఫిక్స్ కాకపోతే బేస్‌కు తిరిగి వచ్చే సామర్థ్యం.
పరిధి: 10–200 కి.మీ, రకాన్ని బట్టి.
విధ్వంస శక్తి: శత్రు వాహనాలు, బంకర్లు, ఆయుధ డిపోలను ఖచ్చితంగా ధ్వంసం చేస్తాయి.
ఆపరేషన్ సిందూర్‌లో వినియోగం
ఈ డ్రోన్లు లాంచ్ ప్యాడ్‌ల నుంచి ప్రయోగించబడ్డాయి, రఫెల్ జెట్ల నుంచి కాదు. ఇవి జైష్–ఎ–మహమ్మద్, లష్కర్–ఎ–తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను నిర్దిష్టంగా లక్ష్యంగా చేసుకున్నాయి.
హామర్ లేజర్ గైడెడ్ బాంబ్
ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన హామర్ (Highly Agile Modular Munition Extended Range) మిస్సైళ్లు మధ్య శ్రేణి, ఎయిర్–టు–గ్రౌండ్ ఆయుధాలు. ఇవి రఫెల్, మిరాజ్ 2000ఈ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించబడతాయి.
లక్షణాలు
కచ్చితత్వం: INS, GPS, IR, లేజర్ గైడెన్స్ ద్వారా 1–10 మీటర్ల కచ్చితత్వం.
పరిధి: 20–70 కి.మీ, లాంచ్ ఎత్తును బట్టి.
వాతావరణ సామర్థ్యం: అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే స్టాండ్–ఆఫ్ ఆయుధం.
లక్ష్యాలు: బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలు, మొబైల్ లక్ష్యాలు.
ధర: సుమారు 80,000–120,000 యూరోలు (రూ.85 లక్షలు).
ఆపరేషన్ సిందూర్‌లో పాత్ర
హామర్ మిస్సైళ్లు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, లాజిస్టిక్ సదుపాయాలను ధ్వంసం చేయడంలో కీలకంగా వ్యవహరించాయి. ఈ ఆయుధాల స్టెల్త్ సామర్థ్యం పాక్ రాడార్లను నిర్వీర్యం చేసింది.
స్కాల్ప్ మిస్సైళ్లు..
స్కాల్ప్ (SCALP EG), లేదా స్టార్మ్ షాడో, ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన లాంగ్–రేంజ్ క్రూయిజ్ మిస్సైల్. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ MBDA తయారు చేసిన ఈ మిస్సైళ్లు 2003 నుంచి సేవలందిస్తున్నాయి. భారత్ ఈ మిస్సైళ్లను రఫెల్ జెట్ల కోసం కొనుగోలు చేసింది.
లక్షణాలు
స్టెల్త్ సామర్థ్యం: రాడార్‌లను తప్పించే అధునాతన సాంకేతికత.
పరిధి: 250–560 కి.మీ (ఎక్స్‌పోర్ట్ వెర్షన్‌లు 250–290 కి.మీ).
లక్ష్యాలు: కమాండ్ సెంటర్లు, ఎయిర్‌ఫీల్డ్‌లు, బంకర్లు, లాజిస్టిక్ కేంద్రాలు.
నావిగేషన్: మల్టీ–లేయర్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు.
ధర: సుమారు 2 మిలియన్ యూరోలు (రూ2.1 కోట్లు).
ఆపరేషన్ సిందూర్‌లో వినియోగం
స్కాల్ప్ మిస్సైళ్లు దూరంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. వీటి లాంగ్–రేంజ్ సామర్థ్యం రఫెల్ జెట్లను శత్రు రక్షణ వ్యవస్థల నుంచి సురక్షిత దూరంలో ఉంచింది.
రఫెల్ ఫైటర్ జెట్..
ఫ్రాన్స్‌లోని డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫెల్ ఫైటర్ జెట్ బహుముఖ యుద్ధ విమానం. ఇది ఎయిర్–టు–ఎయిర్, ఎయిర్–టు–గ్రౌండ్ దాడుల్లో అసమాన సామర్థ్యం కలిగి ఉంది. భారత వైమానిక దళంలో 2019 నుంచి చేరిన ఈ విమానాలు దక్షిణాసియాలో శక్తి సమతుల్యతను మార్చాయి.
సాంకేతిక విశేషాలు
స్పీడ్: మాక్ 1.8 (సుమారు 2,225 కి.మీ/గంట).
పరిధి: 3,700 కి.మీ (కంబాట్ రేంజ్ 1,850 కి.మీ).
ఆయుధాలు: స్కాల్ప్, హామర్ మిస్సైళ్లు, మీటియోర్ BVR మిస్సైళ్లు, 30mm కానన్.
రాడార్: AESA (Active Electronically Scanned Array) రాడార్, లాంగ్–రేంజ్ టార్గెట్ డిటెక్షన్.
స్టెల్త్: రాడార్ క్రాస్–సెక్షన్ తగ్గించే డిజైన్.
ఆపరేషన్ సిందూర్‌లో పాత్ర
రఫెల్ జెట్లు సరిహద్దు దాటకుండా 100–150 కి.మీ దూరంలోని లక్ష్యాలను కఖచ్చితంగా ధ్వంసం చేశాయి. బహవల్పూర్, మురిద్కే, సియాల్‌కోట్, PoK లోని కోట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడులు పాక్ రక్షణ వ్యవస్థలను అవాక్కు చేశాయి.
ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక విజయం
పహెల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో మొబైల్ రాడార్లను భారీగా మోహరించినప్పటికీ, భారత్ ఉపయోగించిన స్టెల్త్ మిస్సైళ్లు, డ్రోన్లు రాడార్‌లను తప్పించాయి. అధిక వేగం, రాడార్–ఎవేడింగ్ టెక్నాలజీ కారణంగా పాక్ సైన్యం అప్రమత్తం కాలేకపోయింది.
Also Read: ఆపరేషన్ సింధూర్.. ఒక్కటైన భారతదేశం