గతేడాది వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. అగ్ర రాజ్యం సైతం కరోనాతో వణికిపోయింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కానీ.. దక్షిణాసియా దేశమైన భూటాన్ మాత్రం కరోనా తన ఛాయలకు రాకుండా నిలువరించడం గొప్ప విశేషం. అధునాతన వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లోపించినప్పటికీ పకడ్బందీ ప్రణాళికతో కరోనాను తరిమి కొట్టింది.
Also Read: బీజేపీ అగ్రనేతల్లో ‘అగ్రి’ టెన్షన్
సుమారు ఏడున్నర లక్ష్లల జనాభా గల ఈ దేశంలో జనవరి 7న ఒక్క వ్యక్తి మాత్రమే చనిపోయాడు. 34 ఏళ్ల ఈ వ్యక్తి కరోనాతో మరణించారని చెబుతున్నప్పటికీ అతను కొంతకాలంగా కాలేయం, మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుండటం గమనార్హం. ఏడున్నర లక్షల జనాభాకు దేశంలో గల వైద్యులు 337 మందే అంటే ఆశ్ఛర్యం కలగక మానదు. వీరిలో క్రిటికల్ హెల్త్ కేర్‌లో శిక్షణ పొందిన వైద్యుడు ఒక్కరే. హెల్త్ కేర్ వర్కర్లు మూడు వేలమందే. ఈ పరిమిత వైద్య సిబ్బందితోనే కరోనా కేసులను 866కు ప్రభుత్వం నియంత్రించగలిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రజలు, వైద్యుల నిష్పత్తి తగినంతగా దేశంలో లేకపోవడం గమనార్హం.
అధునాతన వైద్య వసతులు, సాంకేతిక పరిజ్ఞానం తమ సొంతమని ఢంకా బజాయించి చెప్పుకునే పాశ్ఛాత్య దేశాలు, అగ్రరాజ్యమైన అమెరికా సహా అనేక దేశాలు కోవిడ్ నియంత్రణలో తడబడిన వేళ భూటాన్ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నిబద్ధత గల నాయకత్వం, పకడ్బందీ కార్యాచరణ, అధికార యంత్రాంగం చిత్తశుద్ధి, ప్రజల సహకారం వల్లే ఈ ఘనతను సాధించింది బుల్లి దేశమైన భూటాన్. ప్రధానమంత్రి లోటే త్సెరింగ్ స్వయంగా ఫిజీషియన్ కావడంతో పరిస్థితి తీవ్రతను గుర్తించి రంగంలోకి దిగారు. పని ఒత్తిడిలో ఇంటికి వెళ్లే తీరిక లేక ఆయన ఒక్కోసారి ఆఫీసులోనే నిద్రించారు. ఆరోగ్యమంత్రి వాంగ్మో కొన్ని వారాలపాటు ఇంటికెళ్లలేదు. కార్యాలయాన్నే ఇంటిగా మార్చుకుని పనిచేశారు.
Also Read: చంద్రబాబు ఔట్.. ఎన్టీఆర్ రావాల్సిందేనా?
రాజు జింగ్మే ఖేసర్ ఖే నామ్ జ్యేల్ వాంగ్ ఛుక్ కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక సహాయనిధిని ప్రారంభించారు. ఉపాధి కోల్పోయిన దాదాపు 35 వేల మందికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వపరంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అందువల్లే అమెరికాలో సుమారు 2.83 లక్షలు, భారత్ లో 1.09 లక్ష్లల కేసులు నమోదు కాగా భూటాన్ ఆ సంఖ్యను 866లోనే కట్టడి చేయగలిగింది. అదే సమయంలో అమెరికాలో నాలుగు లక్షలకు పైగా, భారత్‌లో లక్షన్నర మరణాలు సంభవించగా భూటాన్‌లో ఒక్కరే మరణించడం గమనించదగ్గ అంశం. పాలన, అధికార యంత్రాంగాలే కాకుండా ప్రజలు కూడా ఈ విషయంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు.
రైతులు సైతం తమ పంట ఉత్పత్తులను విరాళంగా అందించారు. ప్రజలు తమ హోటళ్లను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు కోసం ఉచితంగా అందజేశారు. ఇక వైద్యుల సేవలను వెలకట్టడం అసాధ్యమని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు స్ఫూర్తితో ప్రజలు పనిచేయడం వల్లే కరోనా మహమ్మారిని వారు పూర్తిస్థాయిలో పారదోగలిగారు. బుల్లి దేశమైన భూటాన్ నుంచి ప్రగతికి మారు పేరని భుజాలు చరచుకునే దేశాలు స్ఫూర్తి పొందాల్సిన ఆవశ్యకత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Only 866 corona cases in bhutan%e2%80%8c
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com