AP MLC Elections : మొత్తం ఏడు ఎమ్మెల్సీ సీట్లు.. ఏడింటిపై పోటీచేస్తోంది వైసీపీ.. 6 సీట్లు వైసీపీవే.. కానీ అందులో ఒక సీటును గెలుచుకోవడానికి తగినంత బలం లేదు.ఇక టీడీపీకి ఒకసీటు గెలుచుకునేంత బలం లేదు. ఈ పార్టీలోని నలుగురు వైసీపీకి జైకొట్టారు. ఇద్దరు వైసీపీ రెబల్స్ పైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఎలా చూసుకున్నా టీడీపీకి సీటు గెలవడం కొంచెం కష్టమే. కానీ ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి ఓటువేసినా.. జగన్ ను ఎదురించినా అది సాధ్యమవుతుంది. అందుకే చంద్రబాబు కాస్త గట్టిగానే వైసీపీ అసమ్మతులతో లాబీయింగ్ చేస్తున్నారట..
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా 174 ఓట్లు పోలయ్యాయి. అయితే ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఓటు వేయలేకపోయాడు.అయితే ఆయన కోసం ఏకంగా విమానాన్ని లేదా హెలిక్యాప్టర్ ను ఏర్పాటు చేసే పనిలో పడింది వైసీపీ.
సాయంత్రం 4 గంటల వరకూ సమయం ఉండడంతో ఏ క్షణమైనా వచ్చి ఆ వైసీపీ ఎమ్మెల్యేతో ఓటు వేయించాలని వైసీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు ఓటు వేయలేదన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. 174 మంది ఓట్లు వేసినా ఓటు వేయని ఒకే ఒక్క ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలోని నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన బొడ్డుకొండ అప్పలనాయుడు. ఇవాళ అప్పలనాయుడి కుమారుడి వివాహం ఉంది. అందుకే ఆయన ఓటు వేసేందుకు విజయనగరం నుంచి విజయవాడకు రాలేకపోయారు. వివాహ తంతు ముగియగానే విజయవాడానికి వస్తానని తెలిపాడట.. దీంతో వైసీపీ అధిష్టానం ఈ ఎమ్మెల్యే కోసం ఏకంగా ప్రత్యేక హెలిక్యాప్టర్ ను పంపింది. ఒక్క ఓటు కోసం వైసీపీ చేసిన ఈ సాహసం చూస్తే వారికి ఎమ్మెల్సీని గెలవడం ఎంత ఇంపార్టెంట్ నో అర్థమవుతోంది.