https://oktelugu.com/

AP MLC Elections : కుండబద్దలు కొట్టిన కోటంరెడ్డి..ఆయన ఓటు ఎవరికి వేశారంటే?

AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. 175 మంది ఎమ్మెల్యేలకుగాను.. వంద మందికిపైగా ఇప్పటికే ఓటు వేశారు. సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత సాయంత్రం కౌంటింగ్ చేయనున్నారు. తుది ఫలితం వెల్లడించనున్నారు. గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం రెబల్స్, ధిక్కారస్వరాలు, అసంతృప్తివాదులు దెబ్బకొడతారన్న బెంగ మాత్రం వెంటాడుతోంది. ప్రధానంగా క్రాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2023 / 02:03 PM IST
    Follow us on

    AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. 175 మంది ఎమ్మెల్యేలకుగాను.. వంద మందికిపైగా ఇప్పటికే ఓటు వేశారు. సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత సాయంత్రం కౌంటింగ్ చేయనున్నారు. తుది ఫలితం వెల్లడించనున్నారు. గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం రెబల్స్, ధిక్కారస్వరాలు, అసంతృప్తివాదులు దెబ్బకొడతారన్న బెంగ మాత్రం వెంటాడుతోంది. ప్రధానంగా క్రాస్ ఓటింగ్ భయం ఇరు పార్టీల్లో ఉంది. అధికార పార్టీకి ధిక్కరించిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎటు ఓటు వేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వారు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తామని చెప్పి బలమైన సంకేతాలు పంపారు.

    -ఒంటరిగా అసెంబ్లీకి కోటం రెడ్డి

    ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంటరిగా వచ్చి తన ఓటును వేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇందులో తాను ఓటెవరికి వేశారన్న దానిపై పరోక్ష సంకేతం ఇచ్చారు. తన ఆత్మప్రబోధానుసారమే ఓటు వేసినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. వైసీపీతో విభేదిస్తూ కొంతకాలంగా విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి ఎమ్మెల్సీ పోలింగ్ లో టీడీపీవైపే మొగ్గుచూపుతారన్న అంచనాల నేపథ్యంలో ఆత్మసాక్షిగానే ఓటు వేసినట్లు ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా అసెంబ్లీలో సైతం కోటంరెడ్డి గట్టి వాయిసే వినిపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ వస్తున్నారు. అటు వైసీపీ సైతం టీడీపీ సభ్యుల కంటే మించి ప్రత్యర్థిగా కోటంరెడ్డిని భావిస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోటంరెడ్డి ఓటు అనేది ఎవరికి వేసి ఉంటారా? అన్న ఆసక్తి అయితే నెలకొంది.

    -కోటం రెడ్డి ఎవరికి ఓటు వేశారంటే?

    వైసీపీ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించే క్రమంలో కోటంరెడ్డి తనలా చాలా మంది సభ్యులు ఉన్నట్టు అప్పట్లో ప్రకటించారు. దానిని గుర్తుచేస్తూ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీలా ఆత్మప్రభోదానుసారం ఎవరైనా ఓటు వేశారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. అందుకు తన దగ్గర సమాధానం లేదని కోటంరెడ్డి చెప్పారు. అందరి ఆత్మల్లో తాను దూరలేను కదా అని బదులిచ్చారు. క్రాస్ ఓటింగ్ గురించి చెప్పడం సాధ్యం కాదని తేల్చేశారు. అయితే ఇప్పటికే రెండు పార్టీలు విప్ ఇచ్చిన నేపథ్యంలో కోటంరెడ్డి బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడలేనట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో సాయంత్రం వరకూ సస్పెన్స్ కొనసాగే చాన్స్ కనిపిస్తోంది. మరో వైసీపీ ధిక్కార ఎమ్మెల్య ఆనం రామనారాయణరెడ్డి ఓటుపై కూడా చర్చ జరుగుతోంది. ఆయన కూడా తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

    -రెబల్స్ ఆరుగురి ఓటే కీలకం

    వైసీపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు సైతం ఓటు వేశారు. ఇప్పటికే వారు అధికారికంగా చేరకున్నా వైసీపీ ఇన్ చార్జిలుగా దాదాపు ఖరారయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విప్ జారీ అయినా వారు ధిక్కరించే చాన్స్ ఉంది. అటు వైసీపీని ధిక్కరించి న ఆ ఇద్దరికి సైతం విప్ జారీ అయ్యింది. మరోవైపు జనసేన సభ్యుడు సైతం వైసీపీ వైపు చేరిపోయారు. అంటే సరాసరి ఆరుగురు సభ్యులు ఇప్పుడు ఎటు మొగ్గుచూపారన్నది ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. మరికొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది,