ఒకటా.. రెండా..? ఒకే రోజు జగన్ కు హై కోర్టు మూడు వాతలు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన ప్రత్యర్థి, ప్రతిపక్షంలా వ్యవహరిస్తుంది మాత్రం టిడిపి కాదు…. బిజెపి జనసేన కూటమి అసలే కాదు. ఆ పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అవును..! గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుక్క తిప్పుకోనివ్వవ్వకుండా ఏపీ హైకోర్టు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. సచివాలయానికి రంగులు, ఇంగ్లీష్ మీడియం గొడవ నుండి మొదలైన వీరి వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా గురువారం నాడు హైకోర్టు […]

Written By: Kusuma Aggunna, Updated On : August 27, 2020 5:01 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన ప్రత్యర్థి, ప్రతిపక్షంలా వ్యవహరిస్తుంది మాత్రం టిడిపి కాదు…. బిజెపి జనసేన కూటమి అసలే కాదు. ఆ పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అవును..! గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుక్క తిప్పుకోనివ్వవ్వకుండా ఏపీ హైకోర్టు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. సచివాలయానికి రంగులు, ఇంగ్లీష్ మీడియం గొడవ నుండి మొదలైన వీరి వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా గురువారం నాడు హైకోర్టు జగన్ ప్రభుత్వానికి ఒకటికి మూడు షాకులు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే…. ఏపీ రాజధాని మార్పు పై హైకోర్టు వారు విధించిన స్టేటస్ కో ని సెప్టెంబర్ 21వ తేదీకి పొడిగించారు. ఇదే విషయమై జగన్ స్టేటస్ కో ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా కోర్టువారు ఆ పిటిషన్ ను కొట్టి వేసి ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పారు. ఇది మొదటి షాక్.

ఇక గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వం పై అమరావతి రైతుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి పొలాలకు సంబంధించిన కౌలు డబ్బులు రెండు నెలల క్రితమే ఇవ్వవలసి ఉండగా ప్రభుత్వం వాటిని తమ అకౌంట్ లోకి జమ చేస్తామని చెప్పి రెండు నెలల నుండి వేయకుండా జాప్యం చేస్తోందని మరొక పిటిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదయింది. వెంటనే హైకోర్టు స్పందించి ముందుగా రెండు రోజుల్లో డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏమైందో ఏమో కానీ మళ్ళీ వెంటనే ఇప్పటికిప్పుడు డబ్బులన్నీ ఎకౌంట్లో ఉండాలని చెప్పడం గమనార్హం.

“ఇదెక్కడి గొడవరా బాబూ….” అని జగన్ అనుకుంటున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాల్పడిన చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజధాని తరలింపు పై ఇచ్చిన స్టేటస్ కో ని ఉల్లంఘిస్తూ వైజాగ్ లో ఏపీ ప్రభుత్వం అధికారిక గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన జరగడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

“మేము ఇక్కడ స్టేటస్ కో ప్రకారమ్ విశాఖలో ఎటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని ఆదేశించాము. తర్వాత కూడా మీరు దానిని ఉల్లంఘించి ఇలా శంకుస్థాపన చేయడం ఏమిటి? అయినా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఐదు ఎకరాల్లో ఉంటే ప్రభుత్వం వారి గెస్ట్ హౌస్ కి 30 ఎకరాలు కావాలా?” అని నిలదీసింది. ఈ విషయమై వెంటనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని హైకోర్టుకి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలా ఒకటే రోజు ఒకటికి మూడు దెబ్బలను హై కోర్టు నుండి ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వం ఇప్పట్లో కోరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.