https://oktelugu.com/

అనసూయ కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయం

అనసూయ.. చాలా పాత పేరు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకే చాలా మంది అభిమానులున్నారు. దానికి కారణం హాట్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ అనే చెప్పొచ్చు. న్యూస్‌ ప్రెజెంటర్గా బుల్లితెరపై కనిపించిన ఈమె ఈటీవీలో ప్రసారం అయ్యే ‘జబర్దస్త్‌’తో భారీ క్రేజ్‌ సంపాందించుకుంది. చిట్టి పొట్టి డ్రెస్సులు, మత్తెక్కించే చూపులు, బోల్డ్‌ కామెంట్స్‌ పాపులర్ అయిందామె. దాంతో, టీవీల్లో టాప్‌ యాంకర్గా కొనసాగుతోంది. అక్కడితో ఆగకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టిందామె. తొలుత ‘క్షణం’ సినిమాలో నెగెటివ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 27, 2020 / 05:09 PM IST
    Follow us on


    అనసూయ.. చాలా పాత పేరు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకే చాలా మంది అభిమానులున్నారు. దానికి కారణం హాట్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ అనే చెప్పొచ్చు. న్యూస్‌ ప్రెజెంటర్గా బుల్లితెరపై కనిపించిన ఈమె ఈటీవీలో ప్రసారం అయ్యే ‘జబర్దస్త్‌’తో భారీ క్రేజ్‌ సంపాందించుకుంది. చిట్టి పొట్టి డ్రెస్సులు, మత్తెక్కించే చూపులు, బోల్డ్‌ కామెంట్స్‌ పాపులర్ అయిందామె. దాంతో, టీవీల్లో టాప్‌ యాంకర్గా కొనసాగుతోంది. అక్కడితో ఆగకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టిందామె. తొలుత ‘క్షణం’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో పోలీసాఫీసర్ పాత్ర చేసినా… చిన్న పాత్ర చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమానే ముందుగా రిలీజైంది. అక్కడి నుంచి టాలీవుడ్‌ దర్శకులు, హీరోలు కన్ను అనసూయపై పడింది. చిన్న పాత్రలో లేదంటే స్పెషల్‌ సాంగ్‌లో అయినా ఆమెను తమ సినిమాలో భాగం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘విన్నర్’ మూవీలో తన పేరుపైనే రాసిన ఓ ఐటమ్‌ సాంగ్‌లో నర్తించిందామె. కానీ, ఆ తర్వాత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

    Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

    మోహన్‌ బాబు ‘గాయత్రి’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన ఆమె.. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ల రంగమ్మత్త క్యారెక్టర్తో తనలోని నటిని బయటపెట్టింది అనసూయ. డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఫిల్మ్‌ఫేర్, సైమా సహా పలు అవార్డులు అందుకుంది. ఆ తర్వాత ఎఫ్2లో ప్రత్యేక పాత్ర చేసిన ఆమె, సచ్చింది గొర్రె, యాత్ర, మీకు మాత్రమే చెప్తాలో చిన్న పాత్రలు చేసింది. కథనం అనే సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారింది. కానీ, గతేడాది విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. ఓవైపు టెలివిజన్‌ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలకూ సమయం కేటాయిస్తోందామె. ప్రస్తుతం ఆమె మూడు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. బన్నీ, సుక్కూ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ఆమె నటిస్తోంది.

    Also Read: ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !

    ఇప్పుడామె కోలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టింది. తొందర్లోనే తమిళ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది. యువ నటుడు సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ అనే హిట్‌ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్‌ రాజు ప్రస్తుతం ‘శూర్పణగై’ అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాడు. రెజీనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. దాంతో, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు కార్తీక్‌ రాజు. రజియా విల్సన్‌ ప్రధాన పాత్రలో మరో తమిళ్‌, తెలుగు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ ఎమోషన్‌ల్‌ థ్రిల్లర్లో అనసూయ కూడా నటిస్తుందని కార్తీక్‌ తెలిపాడు. ఈ చిత్రంతో అనూ తమిళ్‌లో కూడా అడుగు పెట్టబోతోందని రివీల్‌ చేశాడు. చిత్రంలో అనసూయది కీలక పాత్ర అని సమాచారం. రెండు వెర్షన్లలోనూ ఆమె నటిస్తోందని సమాచారం. మరోవైపు తెలుగు వెర్షన్‌లో సత్యం రాజేశ్‌, మధునందన్‌ కూడా కనిపిస్తారని కార్తీక్‌ రాజు తెలిపాడు. ఏదేమైనా ఇప్పుడు తెలుగు టీవీతో పాటు సినిమా రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తమిళ్‌లోనూ అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.