దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!

చాలా తక్కువ టైమ్‌లో మంచి గుర్తింపు, స్టార్డమ్‌ తెచ్చుకున్న హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా. వెండితెరపై హాట్‌ పెయిర్ ఇది. వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌ అయింది. ‘డియర్ కామ్రేడ్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, రెండు సినిమాల్లో విజయ్‌, రష్మిక రొమాన్స్‌ మాత్రం బాగా పండింది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్‌లో హాట్ హాట్ లిప్‌ లాక్స్‌తో యూత్‌ను కనువిందు చేశారు ఈ ఇద్దరూ. అలాగే, […]

Written By: Neelambaram, Updated On : August 27, 2020 4:56 pm
Follow us on


చాలా తక్కువ టైమ్‌లో మంచి గుర్తింపు, స్టార్డమ్‌ తెచ్చుకున్న హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా. వెండితెరపై హాట్‌ పెయిర్ ఇది. వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌ అయింది. ‘డియర్ కామ్రేడ్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, రెండు సినిమాల్లో విజయ్‌, రష్మిక రొమాన్స్‌ మాత్రం బాగా పండింది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్‌లో హాట్ హాట్ లిప్‌ లాక్స్‌తో యూత్‌ను కనువిందు చేశారు ఈ ఇద్దరూ. అలాగే, ఈ మూవీ ప్రమోషన్స్‌లోనూ వీళ్లు చేసిన హంగామా అంతా ఇంత కాదు. దాంతో, ఇద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు కూడా వచ్చాయి.

Also Read: ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !

తాజాగా ఈ వీళ్లు మరోసారి కలిసి నటించబోతున్నారు. అలాగని విజయ్‌, రష్మిక మూడోసారి వెండితెరపై జోడీ కట్టడం లేదు. వీళ్లిద్దరూ కలిసి ఓ ప్రకటనలో యాక్ట్‌ చేయబోతున్నారు. ప్రముఖ వస్త్ర కంపెనీ కి సంబంధించిన ప్రకటనలో ఇద్దరూ కనిపిస్తారని తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ బ్రాండ్‌కు తనతో పాటు లేడీ అంబాసిడర్గా రష్మిక పేరును విజయ్ దేవరకొండనే సిఫారసు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం యూత్‌లో ఇద్దరికీ మంచి క్రేజ్‌ ఉంది. గతంలో ఇద్దరూ కలిసి నటించిన యాడ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో, విజయ్‌ ప్రపోజల్‌కు సదరు కంపెనీ వెంటనే ఓకే చెప్పిందట. తొందర్లోనే జరిగే యాడ్‌ షూట్‌లో విజయ్, రష్మిక పాల్గొంటారని సమాచారం.

Also Read: ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌

సినిమాల విషయానికి వస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’తో తీవ్రంగా నిరాశ పరచిన దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ‘ఫైటర్’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో హిందీలో కూడా అడుగు పెట్టబోతున్నడు విజయ్. దీనిపై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీ, తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్‌ కాబోతోంది ఈ మూవీ. మరోవైపు రష్మిక వరుస విజయాలు, అవకాశాలతో జోరు మీదుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూ, భీష్మతో రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, తమిళ్ లో సుల్తాన్, కన్నడలో పొగరు చిత్రాలు కూడా చేస్తోందామె.