https://oktelugu.com/

15 రోజుల్లోనే మరో లక్ష కేసులు!

దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి రెండు లక్షలు దాటింది. మే 17 నాటికి లక్ష దాటిన కరోనా కేసులు ఈ నెల 3 నాటికి 2లక్షలు దాటడం గమనార్హం. అంటే 15 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. తాజాగా 24 గంటల్లో గరిష్ఠంగా 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. మొదటి లక్ష కేసులకు 111 రోజులు పడితే… రెండో లక్ష కేసులు 15 […]

Written By: , Updated On : June 4, 2020 / 11:17 AM IST
Follow us on

lock down 5.0

దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి రెండు లక్షలు దాటింది. మే 17 నాటికి లక్ష దాటిన కరోనా కేసులు ఈ నెల 3 నాటికి 2లక్షలు దాటడం గమనార్హం. అంటే 15 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. తాజాగా 24 గంటల్లో గరిష్ఠంగా 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. మొదటి లక్ష కేసులకు 111 రోజులు పడితే… రెండో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదయ్యాయి. వరుసగా మూడోరోజు 200కి పైగా మరణాలు నమోదయ్యాయి.

“ఈ గణాంకాలు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాయి.
కొవిడ్‌ కల్లోలం నెలకొన్న అనేక దేశాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉండటంతోపాటు కోలుకుంటున్న వారి శాతమూ పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నా… ఇప్పుడు ప్రతిఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉంటే మహమ్మారి తీవ్రత నుంచి అంతగా బయటపడతాం.” అని వైద్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.