Sircilla: గొలుసుకట్టు వ్యాపారాలతో నష్టాలే ఎక్కువ. ఏదో కొంత కాలం నడిపి తరువాత బోర్డులు తిప్పేయడం చూస్తున్నాం. అయినా మోసపోతున్నాం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే మధ్య తరగతి బతుకుల మీద దెబ్బలు పడుతూనే ఉంటాయి. అయినా మనలో చైతన్యం రాదు. ఏదో డబ్బులు సంపాదించాలనే యావ తప్ప. అందులో లోతుపాతులు అంతగా తెలియవు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల కేంద్రంగా గత నాలుగైదేళ్లుగా ఓ గొలుసుకట్టు వ్యాపారం సాగుతోంది. దానికి చుట్టుపక్కల మండలాల్లో ఏజెంట్లు సైతం పుట్టుకొచ్చారు. రోజు వారీ కూలీలు, దుకాణాల నిర్వాహకులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వారిని వ్యాపారంలో చేర్పించారు.
దీంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగానే సాగింది. దీంతో చాలా మందిని ఇందులో సభ్యులుగా చేర్పించారు. ఏజెంట్ల చేతివాటం పెరిగింది. డబ్బులు కూడా సమయానికి ఇచ్చేవారు. దీంతో అందరిలో నమ్మకం వచ్చింది. ఇంకా సభ్యుల సంఖ్య రెట్టింపయింది. అదే సమయంలో కొద్ది రోజులుగా డబ్బులు సమయానికి ఇవ్వకపోవడంతో సభ్యులందరు కార్యాలయానికి రావడం మొదలైంది. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఇదంతా బాగా లేదని భావించి రాత్రికి రాత్రే ఉడాయించారు. దీంతో మోసపోయామని భావించిన లబ్ధిదారులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టారు.
Also Read: అద్దె కట్టలేదని ఇంట్లో నుంచి మాజీ ప్రధానిని గెంటేసిన ఓనర్
ఇంకేముంది కేసు దర్యాప్తు చేస్తున్నా వారు దొరికితేనే కదా. ఉన్న దాంట్లో సర్దుకుని ఉండక ఏదో వస్తుందని ఆశపడితే చివరకు ఏమైంది మోసపోయామని తెలుసుకోవడం తప్ప. ఏమైనా వచ్చిందా? కష్టపడకుండా వచ్చిందేదీ నిలవదు. మన కష్టంతో వచ్చిందేదైనా మనల్ని విడిచిపోదు అనే సత్యాన్ని గ్రహించడం లేదు. ఏవో మాయమాటలు నమ్మి మోసపోవడం సాధారణమే. ఇప్పుడు ఎవరిని అడుగుతారు. దాచుకున్న డబ్బులు ఎలా తెచ్చుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో అప్పనంగా వస్తుందనే ఆశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకున్నట్లే అవుతుంది. మోసపోయాక బాధపడటం కంటే మోసపోకుండా ఉండటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టపడగా వచ్చిన డబ్బును దాచుకుని పొదుపు చేసుకోవాలే తప్ప దాంతో వ్యాపారం చేయాలనుకుంటే ఇలాగే అవుతుంది. సంతృప్తిలోనే ఉంది సంపద అన్నారు. అందుకే ఫైనాన్స్ ల్లో పెట్టుబడి పెట్టేకంటే బ్యాంకులో దాచుకోవడమే ఉత్తమం.
Also Read: ఎట్టకేలకు ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఇక పోరాటం చేస్తారా?