Congress’ One Family, One Ticket: కాంగ్రెస్‌లో ఉత్సహవంతులైన నాయకులను అధిష్టానం తెలిచ్చన కొత్త రూల్ కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలకు కే రాఫ్‌గా ఉన్న కాంగ్రెస్‌లో ఇకపై ఒకే కుటుంబం.. ఒకే టికెట్ నిబంధన అమలు కానుంది. ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన చింతన్ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. భారతీయ జనతాపార్టీ అమలు చేస్తున్న ఈ విధానం తాజాగా కాంగ్రెస్‌లోనూ అమలు చేయనుండడంతో టికెట్‌పై ఆశతో ఇన్నాళ్లూ పనిచేసిన నాయకులు పునరాలోచనలో పడ్డారు.
అధినేత్రి కుటుంబం నుంచి ప్రారంభించాలి?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన నిర్వహించిన చింతన్ సమావేశంలో తీసుకున్న కొత్త నిబంధన ఒకే కుటుంబంలో ఒకే టికెట్‌పై విమర్శలు రాకుండా ఉండాలంటే ముందుగా ఆ నిబంధన సోనియాగాంధీ కుటుంబం నుంచే అమలు చేయాలి. కానీ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ కుటుంబ నిబంధన అమలు చేస్తే సోనియాగాంధీ తప్పుకున్నా.. రాహుల్, ప్రియాంక టికెట్ తప్పనిసరి. మరి కొత్త నిబంధన వీరికి వర్తించకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిబంధనలో కొంత మార్పు చేశారు. పార్టీలో ఐదేళ్ల సినియారిటీ నిబంధన తెచ్చారు. ఐదేళ్లపాటు పార్టీలో పనిచేస్తే టికెట్ ఇవ్వొచ్చు అని సడలింపు ఇచ్చారు.
కొత్తగా వచ్చేవారి పరిస్థితి ఏంటి?
కొత్త రూల్ కాంగ్రెస్‌లో కొత్తగా చేరాలనుకునే వారీకీ ఇబ్బందే. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఆశవహులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా సైలెంట్‌గా ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి జంప్ కావడం ఖాయం. ఇందులో కొందరు కాంగ్రెస్, కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఐదేళ్ల నిబంధనతో కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ప్రతిబంధకంగా మారుతుందన్న వాదన వినిపిస్తోంది. అదేసమయలో పార్టీలో కొత్తగా చేరి ఇప్పటికే యాక్టివ్‌గా పనిచేస్తున్నవారిని కూడా ఐదేళ్ల నిబంధన నిరుత్సాహపరుస్తోంది.
Also Read: MLA Etela Rajender: ఈటలకు మింగుడు పడని బీజేపీ వ్యవహారం… పార్టీ మారేందుకు సన్నద్ధం
కాంగ్రెస్ నినాదం.. బీజేపీకి ఆయుధం..
కాంగ్రెస్ తీసుకువచ్చిన కొత్త నిబంధన పార్టీలోని యాక్టివ్ పర్సన్స్ పునరోచనలో పడ్డారు. తెలంగాణలో సీనియర్ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమతోపాటు తమ వారసులను కూడా బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో జానారెడ్డి, ఉత్తమంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య ఇలా చాలామంది ఉన్నారు. చింతన్ శిబిరంలో తీసుకున్న రూల్ వీరందరికీ వర్తింపజేస్తే పార్టీకి నష్టమే అనే అభిప్రాయం పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో సీనియర్లు కాంగ్రెస్‌లో ఉండి, వారసులను మరో పార్టీలోకి పంపి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి ఇది కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తంవుతోంది. ఇదే జరిగితే మొత్తంగా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. మరి కొత్త రూల్ అమలు ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Also Read:Kiran Kumar Reddy: ఆయన చేరికకు బ్రేక్.. కిరణ్‌కుమార్‌కు ద్వారాలు మూసేసిన కాంగ్రెస్