Minister Puvvada Ajay Kumar: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మాటల యుద్దాలు మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ దావోస్ వేదికగా కలిసి ఫొటోలు తీయించుకున్నారు. తాము సోదరుల్లా ఉంటామని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెట్టారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరోలా ఉంటున్నాయి. వారిద్దరి మనసులో ఏముందో కానీ తెలంగాణ మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏపీ సీఎం జగన్ పై విమర్శలకు దిగడం సంచలనం సృష్టిస్తోంది. ఇందులో మర్మమేమిటో అర్థం కావడం లేదు. గతంలో కేటీఆర్ కూడా ఏపీ పరిస్థితిపై తనదైన శైలిలో విమర్శలు చేయడంతో అక్కడి నేతలు స్పందించి కేటీఆర్ ను ఇరుకునపెట్టారు. దీంతో ఆయన జగన్ కు తనకు సోదర సమానుడని వ్యాఖ్యినించి గొడవ రాకుండా చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మాటల యుద్ధం మొదలు కావడంతో ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియడం లేదు.

దావోస్ లో ఏపీకి పెట్టుబడులు రాకపోవడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదని మంత్రి అజయ్ విమర్శలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంటే ఏపీ మాత్రం దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థతో నిత్యం నరకం అనుభవిస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన తీరుపై ఆక్షేపించారు. రాష్ట్రంలో పాలన సరిగా లేదని చెప్పడంతో అక్కడి నేతల్లో ఆందోళన నెలకొంది. మంత్రి అజయ్ వ్యాఖ్యల్లో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు. పెట్టుబడులు రాకపోవడంతో జగన్ ఆత్మరక్షణలో పడిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: Congress’ One Family, One Ticket: ఒకే కుటుంబం.. ఒకే టికెట్… కాంగ్రెస్‌లో క్వాలిఫికేషన్ కష్టాలు..!!
కేటీఆర్ పెట్టుబడులు తెస్తుంటే జగన్ మాత్రం నైరాశ్యంలో కూరుకుపోయారు. దీంతోనే ఆయన పరిపాలనపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దావోస్ లో వారిద్దరు బాగానే ఉన్నా ఇక్కడకు వచ్చే సరికే ఇలాంటి ఆరోపణలు మళ్లీ రావటంలో ముందస్తు వ్యూహం ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఏపీ వాసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

దావోస్ లో అన్నదమ్ముల్లా ఫొటోలు దిగినా ఇక్కడకు వచ్చే సరికే పరిస్థితి ఎందుకు మారిపోయింది. ఇందులో ఏదో విషయం దాగి ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ తీరుతో ఏపీ భవిష్యత్ ఏమైపోతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. మంత్రి అజయ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కూడా వాదనలు వస్తున్నాయి. అసలు అజయ్ అలా మాట్లాడటానికి కారణాలేంటనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామిక వేత్తలు నిరాకరిస్తున్నారనే వాదనలు కూడా వస్తుండటంతో ఏపీ పరిస్థితి ఎటు వైపు వెళ్తుందో అర్థం కావడం లేదు.
మొత్తానికి గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మంత్రి అజయ్ చెబుతున్న మాటలతో జగన్ అంతర్మథనంలో పడిపోయినట్లు తెలుస్తోంది. అసలే రాష్ర్టంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, అమలాపురం గొడవలు ప్రధానంగా తెరపైకి రావడంతో ఇక ఏపీ భవితవ్యం ఏమిటో తెలియడం లేదు. రాబోయే రోజుల్లో ఇవి వైసీపీ మనుగడకు అడ్డు తగిలే అవకాశాలే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Tollywood Heroes Politics: రాజకీయ నాయకులుగా స్టార్ హీరోలు…?
Recommended Videos:



[…] […]
[…] […]