ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చి భాగ్యనగరాన్ని నిండా ముంచాయి. వరద బాధితులను ఆదుకునేందుకు కేసీఆర్ విరాళాల కోసం పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో చాలా వరకు రాష్ట్రాల సీఎంలు స్పందించారు. సినీ ఇండస్ట్రీ నుంచి.. వ్యాపార వేత్తలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా ఒక్కరోజు వేతనాన్ని విరాళం కింద తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమైంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
తమ అనుమతి లేకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై షాక్‌కు గురయ్యారు. ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఉద్యోగుల వద్ద నుంచే తీసుకోవాలని అంటున్నారు. దీంతో ప్రధాన ఉద్యోగ సంఘాలు నోరు మెదపలేని స్థితిలో ఉన్నాయి. దీంతో చిన్నా చితకా ఉద్యోగ సంఘాల ద్వారా తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక్క రోజు జీతం సీఎంఆర్ఎఫ్‌కు జమ చేశారు.
Also Read: దుబ్బాక ఎన్నిక: రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందా..
హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం ప్రభుత్వం రూ.550 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రకటించింది. అంత మొత్తంలో నిధులు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో ప్రభుత్వం కొంత కేటాయించి.. కొంత విరాళాల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగుల ఒక్క రోజు జీతం విరాళం ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేసినప్పుడు ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. అప్పుడే కేసీఆర్ వారికి డీఏ ప్రకటించి.. దసరా తర్వాతి రోజు సెలవుగా ఇచ్చి కూల్ చేశారు. ఇప్పుడు జీతం కట్ చేసే సరికి మళ్లీ ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైంది.
Also Read: గ్రౌండ్ రిపోర్ట్: దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్..భారీగా పోలీసులు
కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మూడు నెలల పాటు ప్రభుత్వం కోత పెట్టింది. ఆ జీతాన్ని వాయిదాల్లో ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు అలా వాయిదాల్లో వచ్చే సొమ్మును.. విరాళం పేరుతో మళ్లీ ప్రభుత్వమే తీసుకుంటోందన్న అసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితికి ఉద్యోగ సంఘాలు వెళ్లాయి. మొదట్లోనే వ్యతిరేకించి ఉంటే.. ప్రభుత్వం వెనక్కి తగ్గేదేమో కానీ.. అంతా అయిపోయిన తర్వాత నోరు పెద్దది చేసుకున్నా ప్రయోజనం ఏముంది.