Omicron Scare: ఒమిక్రాన్ వేరియంట్ మనదే శంలో క్రమంగా విస్తరిస్తోంది రోజురోజుకు కేసుల సంఖ్య పెంచుకుంటోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్లీ స్కూళ్లు మూసివేతకు ప్రతిపాదనలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తూ భయాందోళనకు గురిచేస్తోంది.

మహారాష్ర్టలో కేసుల సంఖ్య మరింత రెట్టింపవుతోంది. దీంతో అక్కడ పాఠశాలలు మూసివేసే ఆలోచన ఉందని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి చెప్పడం గమనార్హం. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లల చదువులు ఏమైపోతాయో అనే వేదన పెరుగుతోంది. కానీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోన్న సందర్భంలో నిబంధనలు విధించడమే తరువాయి అని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ముంబై, పుణెలో డిసెంబర్ 15నే స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మళ్లీ మూతపడే ప్రమాదం పొంచి ఉండటంతో ఇక ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో మహారాష్ర్ట సర్కారు నిర్ణయంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలనే మూసి వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: 2021 మ్యూజికల్ రివ్యూ : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్
కర్ణాటకలో కూడా పండుగల నిర్వహణపై ఆంక్షలు విధించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. డీజేల వినియోగం వద్దని చెప్పింది. దీంతో ప్రజలు నిబంధనల విషయంలో సహకరించకపోతే శిక్షార్హులవుతారని సీఎం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని చెబుతున్నారు.
Also Read: Actor Nani: హీరో నాని సంచలన నిర్ణయం… ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే