https://oktelugu.com/

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం ఇళ్ల స్థలాల పంపిణీ. రాష్ట్రంలో సొంతిల్లు లేని ప్రతి పేదవాడికి లభ్ది చేకూర్చేలా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల నుండి అప్లికేషన్స్ తీసుకొని అధికారుల పర్యవేక్షణలో పారదర్శంగా ఈ పథకం అమలు జరగాలని జగన్ ఉద్దేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా నిన్న వై యస్ ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ జరగాల్సివుంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 9, 2020 / 08:53 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం ఇళ్ల స్థలాల పంపిణీ. రాష్ట్రంలో సొంతిల్లు లేని ప్రతి పేదవాడికి లభ్ది చేకూర్చేలా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల నుండి అప్లికేషన్స్ తీసుకొని అధికారుల పర్యవేక్షణలో పారదర్శంగా ఈ పథకం అమలు జరగాలని జగన్ ఉద్దేశించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా నిన్న వై యస్ ఆర్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ జరగాల్సివుంది. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది.

    ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

    ఐతే ఇళ్ల స్థలాల అర్హుల జాబితాను రూపొందించడంలో పారదర్శకత లేదని, అధికారులు చిత్త శుద్దితో పనిచేయడం లేదన్న విమర్శ గట్టిగా వినిపిస్తుంది. గ్రామ సచివాలయాలలో వి ఆర్ ఓ స్థాయి అధికారులనుండి…మండల స్థాయి అధికారులు వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేకున్నా లంచాలు ఇచ్చినవారికి లేదా పైరవీలు నడిపిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారని సమాచారం. వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఈ జాబితాలలో చోటు లభించలేదట. 50శాతానికి పైగా అనర్హుల పేర్లు జాబితాలలో చోటు చేసుకున్నాయట. మరో ప్రక్క టీడీపీ నేతలు తమ వైసీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు పంచే కార్యక్రమం మినహా, ఇది మరోటి కాదని విమర్శిస్తుండగా…అధికారుల చేతివాటం జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది.

    ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా

    ఇళ్ళు ఉన్న వారు , ఆర్థిక స్థోమత కలిగినవారి పేర్లు అర్హుల జాబితాలో చూసి, నిజంగా ఇల్లు లేనివారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ప్రజలే తీవ్ర విమర్శలు చేయడంతో పాటు గ్రామ సచివాలయాల ముందు నిరసలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టిన మంచి పని పక్కదారి పట్టి జగన్ పట్ల చెడ్డ అభిప్రాయం ప్రజలలో కలిగేలా చేస్తుంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని అర్హులను గుర్తించడంతో పాటు, అనర్హులను తొలగిస్తే పధకం లక్ష్యం నెరవేరుతుంది. లేని పక్షంలో ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం ఖాయం.