Condoms In Maoist Camp: భూమికోసం, భుక్తి కోసం, దోపిడి పాలన విముక్తి కోసం పోరాటాలు సాగించే మావోయిస్టులు దారి తప్పుతున్నారా? ఉద్యమం పేరు చెప్పి తప్పుడు పనులు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు పోలీసులు. ఇటీవల ఒడిస్సా, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో పోలీసులే పై చేయి సాధించారు.. ఈ క్రమంలో మావోయిస్టుల శిబిరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి.
కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు
మావోయిస్టుల శిబిరంలో పోలీసులు సోదాలు చేస్తున్నప్పుడు వారికి కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు, గర్భ నిర్ధారణ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. ” మావోయిస్టుల శిబిరాల మీద దాడి చేసినప్పుడు మాకు ఆయుధాలు, విప్లవ సాహిత్యం, బుల్లెట్లు, ఇతరత్రా మందు గుండు సామాగ్రి లభించేది. కానీ తొలిసారిగా కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు, గర్భ నిర్ధారణ కిట్లు లభించాయి. ఇది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” ఒడిస్సా రాష్ట్రం నవరంగపూర్ జిల్లా ఎస్పీ ఎస్. సుశ్రీ చెబుతున్నారు.
ఇలా దొరికాయి
ఒడిస్సా ప్రత్యేక ఆపరేషన్ గ్రూపు పోలీసుల బృందం గత బుధవారం ఉదయం నబరంగపూర్ జిల్లా రాయ్ గడ్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించింది. కొద్దిసేపటికే ఉదంతి అనే అభయారణ్యంలో సాయి బిన్ కచ్చర్ గ్రామం వద్ద పోలీసులు మావోయిస్టు శిబిరాన్ని గుర్తించారు. అయితే ఈ శిబిరంలో 25 మంది దాకా ఉన్నారు. వారిని చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అయితే మావోయిస్టు శిబిరంలో పెద్ద సంఖ్యలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు, గర్భ నిర్ధారణ కిట్లు, డిటోనేటర్లు, రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
యువతులు వస్తున్నారు
చత్తీస్ గడ్ లో సల్వాజుడుం చేసిన అక్రమాలు తట్టుకోలేక చాలామంది ఆదివాసీ యువత మావోయిస్టుల్లో చేరారు. గతంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ చేరికలు భారీగా ఉండేవి. అయితే ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల ఈ ప్రాంతం నుంచి రిక్రూట్మెంట్ దాదాపుగా ఆగిపోయింది. అయితే మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్ చత్తీస్ గడ్ ప్రాంతం నుంచి ఎక్కువగా జరుగుతోంది. అయితే వీరిలో ఎక్కువ శాతం యువతులు ఉండటం విశేషం. అయితే గతంలో మావోయిస్టు దళాల్లో మహిళలపై అత్యాచారాలు జరిగేవి అనే ఆరోపణలు ఉండేవి.. అయితే తాజాగా దొరికిన కండోమ్ లు, గర్భ నిర్ధారణ కిట్లు, గర్భ నిరోధక మాత్రలు పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని పోలీసులు అంటున్నారు. పైగా ఎక్కువ శాతం అడవుల్లో ఉండటం, దళంలో లెక్కకు మిక్కిలి అమ్మాయిలు ఉండటంతో మావోయిస్టులు ఆ సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారని తెలుస్తోంది.. గర్భం దాల్చకుండా ఉండేందుకు కండోమ్ లు ఉపయోగిస్తున్నారని సమాచారం.. ఒకవేళ గర్భం దాల్చితే దానిని తొలగించుకునేందుకు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. అయితే మావోయిస్టు శిబిరంలో కండోమ్ లు, గర్భ నిర్ధారణ కిట్లు, గర్భ నిరోధక మాత్రలు దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
#Success on anti naxal front
Based upon a real time intelligence, an anti-Maoist operation was launched on the Raighar–Sobha (Gariyabandh-CG) border. Exchange of fire held between SOG and CPI (Maoist). Huge quantities of camp articles have been seized.@DGPOdisha @digswrkoraput pic.twitter.com/nPuLT9Twp7— Nabarangpur Police (@SpNabarangpur) April 27, 2023