ఉత్తరాంధ్రకు ‘అక్టోబర్‌’ భయం..!

  బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్రకు తుఫాను గండాలు వెంటాడుతున్నాయి. తుఫాను సంభవించిన ప్రతీసారి అక్టోబర్‌లో నెలలోనే రావడం ఆందోళనకు గురిచేస్తోంది.  ఇప్పటి వరకు వచ్చిన ఫైలిన్‌, హుదుద్‌, తిత్లీ తుఫాన్‌లు అక్టోబర్‌లోనే వచ్చాయి. ఈసారి అక్టోబర్‌ నెలలోనే వాయుగుండం అల్పపీడనంగా మారి దూసుకొస్తుండడంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గత ఏడేళ్లలో మూడు తుఫాన్లు వచ్చి ఈ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. తుఫాను తెచ్చిన నష్టం నుంచి కోలుకునేలోపే మరో గండం […]

Written By: NARESH, Updated On : October 13, 2020 12:35 pm
Follow us on

 

బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్రకు తుఫాను గండాలు వెంటాడుతున్నాయి. తుఫాను సంభవించిన ప్రతీసారి అక్టోబర్‌లో నెలలోనే రావడం ఆందోళనకు గురిచేస్తోంది.  ఇప్పటి వరకు వచ్చిన ఫైలిన్‌, హుదుద్‌, తిత్లీ తుఫాన్‌లు అక్టోబర్‌లోనే వచ్చాయి. ఈసారి అక్టోబర్‌ నెలలోనే వాయుగుండం అల్పపీడనంగా మారి దూసుకొస్తుండడంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గత ఏడేళ్లలో మూడు తుఫాన్లు వచ్చి ఈ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. తుఫాను తెచ్చిన నష్టం నుంచి కోలుకునేలోపే మరో గండం సంభవించడం ఇక్కడ ప్రజలకు శాపంగా మారింది.

Also Read: హైదరాబాద్ హై అలర్ట్: వణికిస్తున్న వాయు‘గండం’!

2013 లో అక్టోబర్‌ నెల 12న వచ్చిన ఫైలిన్‌ తుఫాను ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. విశాఖ పట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రాణాలతో పాటు ఆస్తుల నష్టం తీవ్రంగా సంభవించాయి. అప్పుడొచ్చిన వాయుగుండం ఏపీ తీరాన్ని దాటి ఒడిశాకు ప్రవేశించి అక్కడా ఇదే స్థాయిలో బీభత్సం సృష్టించింది.

ఆంధ్రను అతలాకుతలం చేసిన మరో తుఫాను 2014 అక్టోబర్‌ 12నే సంభవించింది. ఫైలిన్‌ తుఫానుతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను భారీస్థాయిలో సేవ్‌ చేసింది. తుఫాను హెచ్చరికను ముందుగానే గుర్తించి సుకక్షిత ప్రాంతాలకు చేరవేసింది. అయినా విశాఖ నగరంపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే చూపింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి నగరంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపింది.

మరోసారి 2018లో అక్టోబర్‌లోనే 11న వచ్చిన తిత్లీ తుఫాన్‌ శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం చూపింది. ఈసారి ప్రాణనష్టం ఎక్కువగానే జరిగింది. ఉత్తరాంధ్రలో మొత్తం కలిపి ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆంధ్ర కంటే ఒడిశాలో దీని ప్రభావం ఎక్కువ చూపింది.

Also Read: రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై బాలీవుడ్ ప్రముఖుల యుద్ధం.. హైకోర్టుకు..

ఈసారి తుఫాను ప్రభావాన్ని ముందుగానే గుర్తించి ప్రభుత్వ రక్షణ చర్యలను చేపట్టింది. అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలకు ఆదేశించింది. అయితే ఈ తుఫాను ఏ ప్రాంతంపై  ప్రభావం చూపుతుందో చూడాలి..