https://oktelugu.com/

High Court Youtube: అసభ్య వీడియోలు.. యూట్యూబ్ కు హైకోర్టు షాక్

High Court Youtube: సోషల్ మీడియాలో జడ్జీలపై అసభ్యపోస్టులు పెట్టిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్ ను హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈకేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ విమర్శల వాడి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 / 10:20 AM IST
    Follow us on

    High Court Youtube: సోషల్ మీడియాలో జడ్జీలపై అసభ్యపోస్టులు పెట్టిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్ ను హైకోర్టు ఆదేశించింది.

    High Court Youtube

    సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈకేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ విమర్శల వాడి తగ్గడం లేదు. నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ‘పంచ్ ప్రభాకర్’ పేరిట సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసభ్య పోస్టులను లాయర్ అశ్వినీకుమార్ లేవనెత్తారు. ఈ మేరకు మెమో దాఖలు చేశారు. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని నివేదించారు.

    ప్రైవేట్ యూజర్ ఐడీల ద్వారా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు వివరించారు. వీడియోలు అప్ లోడ్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్ ను ఆదేశించింది. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానెల్ నిర్వాహకుల అరెస్ట్ కు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

    Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?

    పంచ్ ప్రభాకర్ కు అమెరికా పౌరసత్వం ఉందని.. అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని చెప్పింది. ఈ క్రమంలోనే పూర్తి వివరాలతో 10 రోజుల్లోనే కౌంటర్ వేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది.

    ఇక యూట్యూబ్ విచ్చలవిడితనానికి హైకోర్టు చెక్ పెట్టింది. ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదావేసింది.

    Also Read: బీజేపీ, టీడీపీలకు జనసేన ఆవిర్భావ దినోత్సవం ‘మార్చి 14’ టెన్షన్