https://oktelugu.com/

Bheemla Nayak Trailer: జాతర చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌.. కళ్ల ముందే అగ్నిగోళం

Bheemla Nayak Trailer: రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ కోసం యావత్‌ భారత సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈక్రమంలో ట్రైలర్‌ విడుదలైనప్పుడు 32 నిమిషాల్లో మూడు లక్షల మంది లైక్‌ చేశారు. అయితే ఈ రికార్డ్‌ని భీమ్లా మంచి నీళ్లు తాగినంత ఈజీగా బీట్‌ చేసేశాడు. కేవలం 13 నిమిషాల్లోనే ఈ మార్కుని దాటేశాడు. దటీజ్‌ పవర్‌ స్టార్‌ అనిపించాడు పవన్. మొత్తానికి పవన్‌ ఫ్యాన్స్‌కి జాతర మొదలైంది. కళ్ల ముందే అగ్నిగోళం బద్దలైనట్టు ఉంది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 22, 2022 / 10:39 AM IST
    Follow us on

    Bheemla Nayak Trailer: రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ కోసం యావత్‌ భారత సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈక్రమంలో ట్రైలర్‌ విడుదలైనప్పుడు 32 నిమిషాల్లో మూడు లక్షల మంది లైక్‌ చేశారు. అయితే ఈ రికార్డ్‌ని భీమ్లా మంచి నీళ్లు తాగినంత ఈజీగా బీట్‌ చేసేశాడు. కేవలం 13 నిమిషాల్లోనే ఈ మార్కుని దాటేశాడు. దటీజ్‌ పవర్‌ స్టార్‌ అనిపించాడు పవన్.

    Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

    మొత్తానికి పవన్‌ ఫ్యాన్స్‌కి జాతర మొదలైంది. కళ్ల ముందే అగ్నిగోళం బద్దలైనట్టు ఉంది భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ చూస్తే. పవర్‌ హౌస్‌ లాంటి పవన్‌ ప్రెజెన్స్‌, కత్తిలాంటి కలం నుండి జాలువారిన త్రివిక్రమ్‌ రచన, దద్దరిల్లే తమన్‌ బ్యాగ్రౌండ్ర్‌, భళా అనిపించిన భల్లాల దేవుడి నటన కలిసి, భీమ్లా నాయక్‌ మాస్‌ ఫీస్ట్‌కి సిద్దం అన్నట్టే ఉంది.

    Also Read:  అసభ్య వీడియోలు.. యూట్యూబ్ కు హైకోర్టు షాక్

    ఇక విడుదలవడమే తరువాయి, రికార్డులు బ్రేక్‌ చేయడానికి పవన్‌ ఫ్యాన్స్‌ రెడీగా ఉన్నారు. భీమ్లానాయక్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేయగానే యూట్యూబ్ కూడా షేక్ అయ్యింది. ఇక ముందుగా అనుకున్న టైం(8.10pm)కి కాకుండా ట్రైలర్‌ను 9గంటలకు విడుదల చేసింది టీమ్.

    Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

    అయినా ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా నిరుత్సాహ పడకుండా ట్రైలర్‌ ను వైరల్ చేశారు. ఇక ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ నటన అదిరిపోయింది. రానా ఎలివేషన్ కూడా బాగుంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంది. భీమ్లానాయక్ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

    Also Read:  బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?

    Recommended Video:

     

    Tags