
ప్రపంచంలోనే భారీ ప్రజానీకంతో అతిపెద్ద లాక్ డౌన్ అమలు పరుస్తున్న భారత్ నెలరోజులకు పైగా కరోనా కట్టడిలో అద్వితీయమైన ఫలితాలు సాధించింది. అనేక దేశాలకన్నా ఈ వైరస్ ను కట్టడి చేయడంలో ఎంతో క్రియాశీలకంగా ఉన్నట్లు సర్వత్రా ప్రసంశలు పొందాము. కానీ లాక్ డౌన్ మూడో దశలో ప్రవేశించిన తర్వాత ఫలితాలు తిరగబడుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కరోనా కేసులు రెట్టింపు కావడంలో రోజుల వ్యవధి పెరుగుతూ ఉండడం మనం సాధిస్తున్న గొప్ప విజయం అంటూ ఆరోగ్య శాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెబుతూ వచ్చారు. రెట్టింపు కావడానికి 12 రోజులు కు పైగా పడుతూ వస్తున్నదని చెబుతూ వచ్చారు. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చ్ 25 ప్రారంభంలో అందుకు మూడు రోజులే పడుతూ ఉండెది.
అయితే ఇప్పుడు మొత్తం కేసులు 50,000 కు చేరుకున్న సమయంలో చూస్తే కేసులు రెట్టింపు కావడానికి ఇప్పుడు అంతగా సమయం పట్టడం లేదనిపిస్తున్నది. ఇప్పుడు ముంబై నగరంలోనే 10,000 కు మించి కేసులు ఉన్నాయి. మొదటి 10,000 కేసులు చేరుకోవడానికి ఒకటిన్నర నెల రోజులు పడితే, ఇప్పుడు 40,000 నుండి 50,000 కు చేరుకోవడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.
అంతర్జాతీయంగా కూడా ఈ ప్రాణాంతక వైరస్ కట్టడిలో భారత్ పరిస్థితి తిరగబడుతూ వస్తున్నది. ఇప్పడు అత్యధిక కేసులు గల దేశాలలో 13వ స్థానంలో ఉంది. భారత్ తర్వాతి స్థానంలో పెరు దేశం 55,000 కేసులతో ఉంది. అత్యధిక కేసులు ఉన్న దేశాలలో గత మూడు రోజులలో భారత్ లో కన్నా తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.
ట్రంప్ కు కరోనా భయం పట్టుకుందా!
భారత దేశంలో 3,000కు మించి కేసులు ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళ్ నాడు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్. ఈ ఏడు రాష్ట్రాలలోని 43,000 కేసులు ఉన్నాయి. అంటే దేశంలోని 80 శాతం కేసులు ఈ ఏడు రాష్ట్రాలలోని ఉన్నాయి.
వీటికి తోడుగా ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కూడా కలిపితే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 90 శాతంకు చేరుకుంటాయి. అదే విధంగా రికవరీ అవుతున్న రోగుల సంఖ్య 27.41 శాతంగా ఉన్నట్లు రెండు రోజుల కేంద్రం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే అంతర్జాతీయంగా ఈ సగటు 32 శాతంగా ఉంది. భారత్ కు కేసుల సంఖ్యలో సమీపంలో ఉన్న పెరులో కూడా 30 శాతంగా ఉంది.