
Nandamuri HariKrishna: నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా ఎంతో మందికి చేరువయ్యారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ తర్వాత వెలుగులోకి వచ్చిన హీరోల్లో బాలక్రిష్ణ, హరికృష్ణ ముఖ్యులు. ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంతో టాలీవుడ్ లోకి హరికృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుంచి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అంతకుముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మంత్రిగా పనిచేశారు. 2008లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యలో నటనకు దూరంగా ఉన్న హరికృష్ణ ‘శ్రీరాములయ్య’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు.
దర్శకుడు ఎన్.శంకర్, తర్వాత వైవీఎస్ చౌదరి తన ‘సీతారామరాజు’లో హరికృష్ణను, నాగార్జునను కలిపి తెరకెక్కించి అలరించారు. కృష్ణతో కలిసి హరికృష్ణ నటించిన ‘శ్రావణమాసం’ అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు హరికృష్ణ గ్యాప్ ఇచ్చారు.
హరికృష్ణకు ముగ్గురు కుమారులు.. జానకీరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్, వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్నారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
హరికృష్ణ కూడా రోడ్డుప్రమాదంలోనే మరణించడం విషాదం నింపింది. ఈరోజు హరికృష్ణ జయంతి కావడంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తోపాటు నందమూరి అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు.
మీ 65వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…Miss You Nanna! pic.twitter.com/MJwwAz7wLk
— Jr NTR (@tarak9999) September 2, 2021