Donald Trump
Donald Trump : అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరు కొనసాగుతోంది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(Make America Great Again) నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అందులో భాగంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజుల్లోనే 38 వేల మంది అక్రమ వలసదారులను వారి దేశాల పంపించారు. మెక్సికో, కెనడా, చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపైనా సుంకాలు పెంచారు. గాజా(Gaja)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పనామా కాలువ, గ్రీన్‌లాండ్(Green land)పై కన్నేశారు. ఇలా ట్రంప్ 2.0 పాలన దూకుడుగా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 250 డాలర్ నోటుపై తన ఫొటో ముద్రించుకోవాలని ముచ్చట పడుతున్నారు. ఈమేరకు ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్(Jho Willson) ఈ విషయాన్ని చట్ట ప్రతిపాదన రూపంలో ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.
విలువైన అధ్యక్షుడిగా గుర్తించేందుకు..
ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజలు ఎక్కువ నగదు లేకుండా అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ను అత్యంత విలువైన అధ్యక్షుడిగా గుర్తించేందుకు 250 డాలర్ నోటుపై ట్రంప్ ఫొటో ముద్రించాలనే నిర్ణయాన్ని బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్‌కు సూచిస్తూ చట్టాన్ని ప్రతిపాదించారు.
స్పందిస్తున్న నెటిజన్లు…
అయితే జో విల్స్‌న్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తున్నారు. మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. 250 డాలర్ల నోటు అవసరమా అని కొందరు. ఇంకా చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని మరికొందరు. ఇదే ప్రధాన్యమా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. విల్సన్ మాత్రం ట్రంప్‌ను గౌరవించేందుకు ఇదే సరైన మార్గమని సమర్థించారు. ఇదిలా ఉంటే ట్రంప్ తన రాజకీయ పట్టును చాటుకుంటున్నారు. ఇటీవల ఆయన ప్రధానంగా ప్రచారం చేసిన కీలక బిల్లును అమెరికా చట్ట సభ 2017–215 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లులో పన్నుల మార్పులు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీ, కొత్త ఇంధన వనరుల కోసం డ్రిల్లింగ్ అనుమతులు, జాతీయ భద్రత కోసం భారీ ఖర్చులు వంటి కీలక అంశాలు ఉన్నాయి.
Web Title: Notes in the name of trump in america everyone is holding their nose
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com