టీకా వేసుకోలేదా? రెండోసారి మరింత డేంజర్?

కోవిడ్ 19 టీకా వేసుకోని వారికి ఇది డేంజర్ న్యూస్. ఒకసారి కరోనా సోకిన జయించిన వారు ఇక తమకు ఏం కాదులే అని నిశ్చితంగా ఉంటారు. అల్ రెడీ కరోనా వచ్చిపోవడంతో ఇక తమను ఆ వైరస్ ఏం చేయలేదని టీకా వేసుకోరు. కానీ ఇప్పుడు అదే వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుందని తాజాగా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన […]

Written By: NARESH, Updated On : August 8, 2021 8:09 pm
Follow us on

కోవిడ్ 19 టీకా వేసుకోని వారికి ఇది డేంజర్ న్యూస్. ఒకసారి కరోనా సోకిన జయించిన వారు ఇక తమకు ఏం కాదులే అని నిశ్చితంగా ఉంటారు. అల్ రెడీ కరోనా వచ్చిపోవడంతో ఇక తమను ఆ వైరస్ ఏం చేయలేదని టీకా వేసుకోరు. కానీ ఇప్పుడు అదే వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుందని తాజాగా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది.

అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు సంచలనమయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే.. తీసుకోని వారికి రెండోసారి కరోనా సోకే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని వెల్లడైంది.

అధ్యయనంలో భాగంగా వందలమందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు కరోనా టీకా తీసుకోని వారి ప్రాణాలకే ముప్పు అని తెలిపారు. గత ఏడాది కరోనా సోకి.. ఈ ఏడాది మే , జూన్ లలో రెండోసారి కరోనా బారినపడ్డ వారిపై చేసిన సర్వే ఆధారంగా ఈ నిజాన్ని తేల్చారు.

‘టీకా పొందని వారికి ఈ రీ ఇన్ఫెక్షన్ ముప్పు ఏకంగా 2.34 రెట్లు ఎక్కువ అని ఈ అధ్యయనంలో తేలింది. అందువల్ల గతంలో కోవిడ్ బారినపడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సీడీసీ సర్వే తేల్చింది. డెల్టా రకం కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇది అత్యంత అవసరం అని సర్వే తేల్చింది.

అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లలో 83శాతం డెల్టా వేరియంట్ గా చెప్పారు. ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు కోవిడ్ తో ఆస్పత్రి పాలు కాకుండా చూడటంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. ప్లూ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.