దుబ్బాక ఎన్నికలు అయిపోయాయి. అక్కడ ఏదో తేడాకొట్టేటట్టే ఉంది.అయితే ఇప్పుడు ఆ తర్వాత వేగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళదామనుకున్న తెలంగాణ సర్కార్ కు హైదరాబాద్ వరద బురద అడ్డంకిగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వరదలను సరిగ్గా ఎదుర్కోలేదనే అపవాదు ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. చాలా కాలనీలు మునగడం.. వరద సాయం విషయంలో టీఆర్ఎస్ నేతల చేతివాటంపై ప్రజలు ఆరోపించడంపై కేసీఆర్ సర్కార్ ఇరుకునపడింది.
Also Read: దుబ్బాక ఎన్నిక: రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందా..
ఇక అడ్డదిడ్డంగా నేతలు చేసిన కబ్జాలు, నాలాలు తొలగించకపోవడం కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. వీటన్నింటిని నేపథ్యంలో పోయిన సారి 99 సీట్లు సాధించిన పెట్టిన కేటీఆర్ కు ఇప్పుడు ముందుంది ముసళ్ల పండుగ అని అంటున్నారు.
2021 జనవరి వరకు జీహెచ్ఎంసీ పదవీకాలం ఉంది.సో డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాల్సిందే.కానీ ఇప్పుడు వరద, దాని దుష్ప్రభావాలతో హైదరాబాద్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఓట్లు అడగానికి వచ్చే టీఆర్ఎస్ నేతలను కొట్టినా కొట్టేసేంత కసిగా ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ కు కష్టమే.
Also Read: దుబ్బాక: నాటి ఫలితాలే పునరావృతం అవుతాయా..!
ఇక బీజేపీ కూడా బలంగా పుంజుకుంది. ఇదే అదునుగా జీహెచ్ఎంసీలో పాగా వేయాలని చూస్తోంది. దీంతో ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎన్నికలకు కేటీఆర్, కేసీఆర్ కు సవాల్ గా మారాయి.