చక్రవడ్డీ మినహాయింపు తప్ప మేమేమీ చేయలేమంటున్న కేంద్రం

కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కేంద్రం ఇటీవల అన్ లాక్ చేస్తుండటంతో మళ్లీ అన్నిరంగాలు పుంజుకుంటున్నాయి. అయితే దీనికి చాలా సమయం పట్టేలా ఉంది. Also Read: చంద్రబాబు రాడు.. లోకేష్ చొరవ చూపడు.. ఏంటిది? లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో దెబ్బతిన్న అన్నిరంగాలకు […]

Written By: NARESH, Updated On : October 10, 2020 3:47 pm
Follow us on

కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కేంద్రం ఇటీవల అన్ లాక్ చేస్తుండటంతో మళ్లీ అన్నిరంగాలు పుంజుకుంటున్నాయి. అయితే దీనికి చాలా సమయం పట్టేలా ఉంది.

Also Read: చంద్రబాబు రాడు.. లోకేష్ చొరవ చూపడు.. ఏంటిది?

లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో దెబ్బతిన్న అన్నిరంగాలకు ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపాన ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఆ ప్యాకేజీ వల్ల ఎవరికీ ప్రయోజనం కలిగిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అలాగే బ్యాంకు రుణగ్రస్థులకు ఊరట కల్పించేలా కేంద్రం ఆదేశాలతో రిజర్వు బ్యాంకు మారటోరియం ఊరట కల్పించింది.

రుణాల చెల్లింపులపై మార్చి 1 నుంచి మే 31వరకు రిజర్వు బ్యాంకు మారటోరియం ప్రకటించింది. ఈ కాలంలో రుణాలు.. వడ్డీలకు సంబంధించిన కిస్తీల చెల్లింపులు వాయిదా వేసుకొచ్చని మార్చి 27 కేంద్రం సర్య్యూలర్ జారీ చేసింది. ఆ తర్వాత దీనిని ఆగస్టు 31 వరకు పొడగించింది. అయితే దీని వల్ల భారమేమే తగ్గదని.. ఆ తర్వాత అయిన చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై సుప్రీం కోర్టు.. కేంద్రాన్ని, రిజర్వు బ్యాంకును ప్రశ్నించింది. దీంతో కేంద్రం రెండు కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారిని మారిటోరియం కాలంలో చక్రవడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు చెప్పింది. మారిటోరియం గడువును పెంచాలేమని.. వడ్డీ మినహాయింపు కుదరదని తేల్చిచెప్పింది. ఇలా చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని చెప్పడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Also Read: తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ మరో వరం!

కేంద్రం ఆయా రంగాలకు కల్పిస్తున్న ఉపశమనాలను కోర్టుకు సమర్పించాలని కోరింది. అయితే అది సాధ్యంకాదని కేంద్ర కోర్టుకు తేల్చిచెప్పింది. కోర్టులు ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై అక్టోబర్ 13న మరోసారి సుప్రీంకోర్టు విచారించనుంది.