https://oktelugu.com/

Venkata krishna : పుకారు కాదు.. వదంతీ కాదు.. ABN నుంచి వెంకటకృష్ణ వెళ్లిపోతున్నాడు.. తర్వాత గమ్యస్థానం ఎక్కడికో?!

రుధిర వర్షం.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో.. అని ఒర్రిన నాగవల్లి మీడియా నుంచే వెళ్ళిపోయింది. విచిత్రమైన ప్రశ్నలు వేసే జాఫర్ సొంత మీడియాను పెట్టుకున్నాడు. యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు.

Written By: , Updated On : February 21, 2025 / 10:42 AM IST
Venkata krishna

Venkata krishna

Follow us on

Venkata krishna : రుధిర వర్షం.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో.. అని ఒర్రిన నాగవల్లి మీడియా నుంచే వెళ్ళిపోయింది. విచిత్రమైన ప్రశ్నలు వేసే జాఫర్ సొంత మీడియాను పెట్టుకున్నాడు. యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. నరసింహారావు ఏబీఎన్ నుంచి వెళ్ళిపోయి సొంత ఫ్లాట్ ఫామ్ ఏర్పరచుకున్నాడు.. టాల్కం పౌడర్ మహా వంశీ సొంతంగా ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఆటో స్పై, పోస్కో రజనీకాంత్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.. బిఆర్ నాయుడు కంటే చంద్రబాబు భజన ఎక్కువ చేసే మూర్తికి టీవీ5 లో పెద్దగా ఇబ్బంది లేదు. సాంబశివరావు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు.

జాతీయ మీడియాలో అర్ణబ్ గోస్వామి(Arnab Goswami) అనే క్యారెక్టర్ ను కాస్త పక్కన పెడితే.. తెలుగు నాట జర్నలిస్టులు రాజకీయరంగులు పూసుకోవడం… రాజకీయ ధోరణిలో మాట్లాడటం.. పిచ్చిపిచ్చిగా పదాలు వదిలేయడం.. తర్కాలతో సొంత భాష్యం చెప్పడం అనేవి పెరిగిపోయాయి. యాజమాన్యాలకు మించి అతిగా ప్రవర్తించడం వల్లే ఆ పాత్రికేయులు కాస్త పార్టీల కార్యకర్తల ముద్ర వేసుకున్నారు.. సాక్షి ఈశ్వర్, ఏబీఎన్ వెంకటకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. అయితే మీడియాలో అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ అలియాస్ పర్వతనేని వెంకటకృష్ణ వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య తెలంగాణలో వడి బియ్యం సంస్కృతి గురించి తనదైన భాష్యం చెప్పి వెంకటకృష్ణ విమర్శల పాలైన సంగతి తెలిసిందే.. వేమూరి రాధాకృష్ణ పొలిటికల్ లైన్ ను మించి డిబేట్ ప్రజెంటర్ గా వెంకటకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతి కేవలం తెలుగు మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. అందువల్లే తెలుగు నాట మీడియా అంటే రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే వ్యవస్థగా మారిపోయింది. జగన్ కు సాక్షి.. చంద్రబాబుకు ఏబీఎన్, ఈటీవీ, మహా టీవీ, టీవీ5.. కెసిఆర్ కు టీ న్యూస్.. అందువల్లే ఆయా పొలిటికల్ క్యాంపులకు ఒకరి వార్తలు మరొకరికి కావాలి. ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులను బుక్ చేయాలని పొలిటికల్ పార్టీల క్యాంపులు తెగ ప్రయత్నాలు చేశాయి. ఆ మధ్య వెంకటకృష్ణను బుక్ చేయాలని వైసిపి సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

ఏబీఎన్ నుంచి వెళ్ళిపోతున్నాడట

వెంకటకృష్ణ ఏబీఎన్ ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నాడట. వాస్తవంగా వెంకటకృష్ణ ఏబీఎన్ నుంచి వెళ్ళిపోతున్నాడని గత మూడు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వెంకటకృష్ణ వెళ్ళింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వెళ్లడం పక్కా ఆట. ఎందుకంటే ఏబీఎన్ ఛానల్ లో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయట. సంస్థాగత ఇబ్బందులు కూడా ఉన్నాయట. అవి వేమూరి రాధాకృష్ణకి కూడా తెలుసు అట. అందువల్లే ఏబీఎన్ రాధాకృష్ణకు కూడా తన మార్గాల ద్వారా వెంకటకృష్ణ వెళ్లిపోతున్న సంగతి తెలుసుకున్నాడట. అయితే తన తదుపరి ప్రయాణంపై వెంకటకృష్ణ క్లారిటీ ఉండడంతో రాధాకృష్ణ కూడా ఏమీ అనలేకపోతున్నాడట. అయితే వెంకటకృష్ణ మరో ఛానల్ కు వెళ్లడానికంటే సొంతంగా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోబోతున్నాడట. ఇప్పటికే ఏబీఎన్ లో పనిచేసిన నర్సింహారావు సొంతంగా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకున్నాడు. టీవీ9 నుంచి బయటికి వెళ్లిపోయిన జాఫర్ కూడా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నాడు. టీవీ9 లో మరికొంతమంది వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారట. అంటే కేవలం ఏబీఎన్ మాత్రమే కాదు, టీవీ 9 లో కూడా కుదుపులు ఉండబోతున్నాయన్నమాట. ఐతే ఇన్నాళ్లు టిడిపి క్యాంప్ అనుకూల వ్యక్తిగా ముద్రపడిన వెంకటకృష్ణ.. ఇకపై న్యూట్రల్ వెంకటకృష్ణ కాబోతున్నాడన్నమాట.