Ravi Teja
Ravi Teja : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సాధించే విజయాలు ప్రేక్షకుల్లో వాళ్లకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిమానులుగా మారడానికి కారణం అవుతున్నాయి… అందుకే సక్సెస్ అనేది ఇండస్ట్రీ లో కీలక పాత్ర వహిస్తుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తు ఉంటాయి. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ యావత్ ఇండియన్ సినిమా అభిమానులను అలరిస్తూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందుకే రవితేజ (Raviteja) కెరియర్ లోనే అప్పటివరకు లేనటువంటి ఒక భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా రవితేజని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపించిన సినిమా కూడా అదే కావడం విశేషం… ఈ సినిమాలో ఆయన సీరియస్ మూడ్ లో ఉంటూ అలాగే కామెడీ చేస్తూ రెండు రకాల క్యారెక్టర్లని ఒకే సినిమాలో పోషించిన రవితేజ ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
అయితే రాజమౌళి మేకింగ్ తో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించినప్పుడు రవితేజ కి డూప్ గా ఆయన తమ్ముడు అయిన భరత్ నటించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…
రవితేజ భరత్ ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి కొన్ని షాట్స్ లో అతన్ని వాడినట్టుగా తెలుస్తోంది. అయితే భరత్ గత కొన్ని సంవత్సరాలు క్రితం కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా రవితేజ ప్రస్తుతం భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక రాజమౌళి సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న కమర్షియల్ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పుడు రవితేజ ‘మాస్ జాతర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే రవితేజ మరోసారి తన సత్తా చాటుకున్నవాడు వాడవుతాడు…