తెలంగాణలో ‘నాన్ వెజ్’ రూల్స్!

  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు కాస్త తగ్గుమొహం పట్టాయి.  హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  కంటోన్మెంట్ ఏరియాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో దాదాపుగా షాపులు తెరుచుకుంటున్నాయి.  ఇక నాన్ వెజ్ షాపులకు కూడా అనుమతిస్తున్నారు. అయితే, అన్ని రకాల నాన్ వెజ్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే కొన్ని రకాల మార్గదర్శకాలను రిలీజ్ […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 8:37 pm
Follow us on

 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు కాస్త తగ్గుమొహం పట్టాయి.  హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  కంటోన్మెంట్ ఏరియాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో దాదాపుగా షాపులు తెరుచుకుంటున్నాయి.  ఇక నాన్ వెజ్ షాపులకు కూడా అనుమతిస్తున్నారు. అయితే, అన్ని రకాల నాన్ వెజ్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే కొన్ని రకాల మార్గదర్శకాలను రిలీజ్ చేశారు.  మార్గదర్శకాలకు అనుగుణంగానే షాపుల నిర్వహణను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా చెత్తబుట్టల ఉండాలి.  వాటికి ఎలాంటి రంద్రాలు ఉండకూడదు. మాంసం కోసేందుకు ఉపయోగించే కత్తులు వంటి వాటిని తప్పనిసరిగా వేడి నీళ్లలో కడగాలి.  షాపుల్లో పనిచేసే వ్యక్తులు తప్పనిసరిగా అఫ్రాన్, హెడ్ గేర్, గ్లౌజులు తొడుక్కోవాలి.  దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసుకోవాలి.  దుకాణాల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి చర్మ వ్యాధులు ఉండకూడదు.  గోర్లు పెంచుకోకూడదు.  అదే విధంగా దుకాణాల్లో ఈగలు వాలకుండా చూసుకోవాలి.  ఇక వ్యర్ధాలను ఎలాంటి పరిష్టితుల్లో కూడా బయట పడెయ్యకూడదు. టన్నుకంటే తక్కువ వ్యర్ధాలు ఉంటె వాటిని భూమిలో పూడ్చిపెట్టాలి.  అంతకంటే ఎక్కువ వ్యర్ధాలు ఉంటె వాటిని బయో మేధనేషన్ ప్రక్రియ ద్వారా విచ్చిన్నం చేయాలి.  ఒకవేళ వీటినుంచి ఎరువులు తయారు చేసేందుకు వీలైతే దానిని ఎరువుగా మార్చి హరితహారంలో వాడాలని ప్రభుత్వం సూచించింది.