Homeఆంధ్రప్రదేశ్‌Non Veg Cooking Training Loans: ఫిష్ కర్రీ, వెజ్ కర్రీ పాయింట్లు.. ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులతో...

Non Veg Cooking Training Loans: ఫిష్ కర్రీ, వెజ్ కర్రీ పాయింట్లు.. ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులతో జగన్ ఆటలు

Non Veg Cooking Training Loans: ఏపీలో నిరుద్యోగ యువకులకు శుభవార్త. జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రయత్నిస్తే బెటర్. లేకుంటే ఇంతకంటే మంచి అవకాశం ఇక దొరకదు. ఎందుకంటే ప్రతీ జనవరిలో ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ జాడలేదు. పోనీ ఇచ్చినా నాలుగైదు పోస్టులతో పండగ చేస్కోండి అని సెలవిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేట టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాభర్తీ చేయరు. అయితే ఉద్యోగం అడగకండి ఉపాధి మాత్రం చూపిస్తానని జగన్ చెబుతున్నారు. ఇప్పటికే వలంటీర్లు,ఇప్పుడు గృహసారధులు అంటూ లక్షలాది మందికి రూ.5 వేలు వంతున జీతాలిచ్చి ఉపాధి మార్గం చూపించారు. వాటిని ఉద్యోగాలని భావించి రాష్ట్రానికి, తన పార్టీకి సేవ చేయాలని సూచించారు. అటు మటన్ మార్డు నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పుడు ఏకంగా వారితో కర్రీ పాయింట్లు ప్రారంభించేందుకుడిసైడ్ అయ్యారు. అది కూడా గిరాకీ ఉండే నాన్ వేజ్ కర్రీ పాయింట్లు. ఇక అమ్ముకున్నోళ్లకు అమ్ముకున్నంత అన్న మాట.

Non Veg Cooking Training Loans
JAGAN

ఆ మధ్య ఫిష్ ఆంధ్రా అని ఒక స్కీమ్ ను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. రండి బాబు రండి..రండి..,తాజా చేపలు తక్కువ ధరకే అంటూ ఊరూవాడ వాటిని నిరుద్యోగ యువతతో ఏర్పాటుచేయించారు. దుకాణాలు పెట్టుకొని ఉపాధి పొందండంటూ నిరుద్యోగ యువతకు సెలవిచ్చారు. ముందుగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. పులివెందుల ప్రజలు తాజా చేపలు, రొయ్యలు తింటారని కలలో కూడా ఊహించారా.. ప్రజల కడుపు నింపేందుకు తాను ఎంతగా తపన పడుతున్నానో అని మృదువైన మాటలు చెప్పుకొచ్చారు. అటు ప్రజారోగ్యం.. ఇటు నిరుద్యోగ యువతకు ఉపాధి.. ఇంతకంటే ప్రజలకు ఏంచేసేది? అని సెలవిచ్చారు. ఇలా రిబ్బన్ కట్ చేసిన రెండు నెలలకే నిర్వహించలేక నిరుద్యోగ నిర్వాహకులు చేతులెత్తేశారు.

అయితే ఫ్రెష్ చేపలు, రొయ్యలే కాదు. చికెన్ కోసి కారంపెట్టి రుచికరమైన ఆహారంగా మార్చే బాధ్యతలను నిరుద్యోగ యువతకు అప్పగించడానికి తాజాగా డిసైడ్ అయ్యారు. ఊరూ వాడా కర్రీ పాయింట్లు పెట్టుకొని బతికేయ్యండి.. అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పిస్తానని చెబుతున్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకేసి పుస్తకం కాదు గరెటను నమ్ముకోండి అంటూ సెలవిస్తున్నారు. వంటకాల తయారీపై కూడా శిక్షణిస్తామన్న బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతీ యువకుడు మంచి వంటగాడిగా మారితేనే ఏపీని అభివృద్ధి పథంలో నడపగలరని సీఎం జగన్ భావిస్తున్నట్టుంది. అందుకే కొత్త పథకాన్ని యమ స్పీడుగా వర్కవుట్ చేస్తున్నారు.

Non Veg Cooking Training Loans
Non Veg Cooking Training Loans

ఫిష్ ఆంధ్రా పథకం ప్రారంభించినప్పుడే.. అదో నవశకానికి నాంది అన్న రేంజ్ లో జగన్ ప్రసంగించారు. అటు పశుసంవర్థక మత్స్య శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు అయితే మీరే చేపలు తినాలా.. పేద ప్రజలకు వద్దా అని సెలవిచ్చారు. దేశంలో ఎక్కడా లేని మహోన్నత పథకంగా అభివర్ణించారు. కానీ అది వర్కవుట్ అవుతుందా లేదా అని చూడలేదు. ప్రారంభించారు. చేతులు కాల్చుకున్నారు. పోనీ దాని వైఫల్యాన్ని గుర్తించారా అంటే అదీ లేదు. ఇప్పుడు యువకుల చేతికి గరెటనిచ్చి వంటకాలు తయారుచేస్తారుట. వాటినే వారి ద్వారా విక్రయిస్తారుట. ఏపీ యువతకు ఇంతకంటే మంచి చాన్స్ మరొకటుండదు. ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఏపీ వారి చేపల పులుసు, చికెన్ జ్యూస్ పథకాన్ని సొంతం చేసుకోండి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular