KCR Mamatha: దేశంలో అనుకున్నట్లే మూడో కూటమి ఏర్పడబోతుందా..? బీజేపీ, కాంగ్రెస్ ను కాదని ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయా..? జాతీయ పార్టీలతో దేశం సర్వ నాశనమైందని.. ప్రాంతీయ పార్టీలు ఒక్కటైతే సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చని ప్రాంతీయ పార్టీ నేతలు భావిస్తున్నారా..? తాజా పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఆజ్యం ఆగ్గి రాజేసింది. కమలంపై కత్తులు నూరేందుకు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంతో సఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలతో కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. ఇక ఆదివారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బహిరంగ ప్రకటన చేయడం ద్వారా మూడో కూటమికి బీజం పడే అవకాశాలున్నాయని అంటున్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం మాట్లాడుతూ ‘కాంగ్రెస్ తో ఏ పార్టీకి సరైన సంబంధాలు లేవు. మిగతా పార్టీలను కాదనీ ఆ పార్టీ ఒంటరిగానే వెళ్తోంది. మా దారిలో మేం వెళ్తాం. లౌకికవాదం కోసం పోరాడే వాళ్లంతా ఒకే వేదికపై రావాల్సిన అవసరం ఉంది. దేశాన్ని కాపాడడం కోసం బాధ్యత తీసుకోవాలి’అని అన్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ‘ త్వరలో విపక్ష ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ గవర్నర్లు అధికార దుర్వినియోగం జరుగుతోంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ’ అని అన్నారు.
Also Read: యంగ్ హీరోయిన్ తో ఆ హీరో పెళ్లి !
గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజీపీ ప్రభుత్వంపై మాటల యుద్ధం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీని సాగనంపాల్సిందేనంటూ ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్నే మార్చాల్సిన అవసరం ఉందనే నుంచి పలు కీలక అంశాలపై విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ప్రాంతీయ పార్టీలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ప్రాంతీయ పార్టీలంతా ఒక్కటి కానున్నామని కూడా తెలిపారు. అయితే విపక్ష ముఖ్యమంత్రులను ఏకం చేయాలని బెంగాల్ సీఎం మమత కూడా నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ కూటమి గురించి మమతా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్యలతో ఆమె కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.
తాజాగా మమత ఆదివారం తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ లతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంతో త్వరలో సమావేశం ఉంటుందని ఆమె అన్నారు. దేశ సమాఖ్యాన్ని కాపాడడం కోసం విపక్ష సీఎంలంతా ప్రయత్నిస్తున్నామని మమతా అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యానాథ్ పై ఆమె విమర్శల వర్షం కురిపించారు.అతను యోగి కాదని భోగి అని సంభదించారు. సమాజ్ వాది పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, దేశ విదేశాల ప్రయోజనాల దృష్ట్యా యూపీలో తృణమూల్ అభ్యర్థులను పోటీకి దింపలేదని తెలిపారు.
ఇక ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్నకాంగ్రెస్ తో మాకు సత్సంబంధాలు లేవని మమతా స్పష్టం చేశారు. విద్వేశం, దురాగతాలు అనే బీజాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని అన్నారు. దేశం అధ్యక్ష తరహా సర్కార్ వైపు అడుగులు వేస్తోంది. అందుకే రాజ్యాంగాన్ని కుప్పకూలుస్తున్నారని మమత ఆరోపించారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మమతా చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్, స్టాలిన్ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రపై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మమత తోడయ్యారు. స్టాలిన్ కూడా కలిసి వస్తానంటున్నారు. అయితే దేశంలో మరే పార్టీ ఈ కూటమిలో చేరుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: చైనాపై ఆధారపడకుండా భారత్ ఉండలేదా..?