https://oktelugu.com/

Surgical Strike: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్

Surgical Strike: తెలంగాణ‌లో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పాకిస్తాన్ పై ఇండియా చేసిన స‌ర్జిక‌ల్ దాడుల‌ను కేసీఆర్ వ‌ట్టివేన‌ని కొట్టిపారేస్తూ దేశ‌భ‌క్తిని శంకిస్తున్నారు. ప్ర‌పంచం యావ‌త్తు వీక్షించినా కేసీఆర్ కు మాత్రం ఎందుకు అనుమానం వ‌చ్చిందో తెలియ‌డం లేదు. దేశ‌భ‌క్తిని శంకించే వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీజేపీ నేత‌లు సూచిస్తున్నారు. స‌ర్జిక‌ల్ దాడుల‌ను గురించి ఆరోప‌ణ‌లు చేస్తుంటే దేశం మీదే చేస్తున్న‌ట్లు గా అభివ‌ర్ణిస్తున్నారు. మ‌రోవైపు కేసీఆర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 15, 2022 / 10:35 AM IST
    Follow us on

    Surgical Strike: తెలంగాణ‌లో టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పాకిస్తాన్ పై ఇండియా చేసిన స‌ర్జిక‌ల్ దాడుల‌ను కేసీఆర్ వ‌ట్టివేన‌ని కొట్టిపారేస్తూ దేశ‌భ‌క్తిని శంకిస్తున్నారు. ప్ర‌పంచం యావ‌త్తు వీక్షించినా కేసీఆర్ కు మాత్రం ఎందుకు అనుమానం వ‌చ్చిందో తెలియ‌డం లేదు. దేశ‌భ‌క్తిని శంకించే వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బీజేపీ నేత‌లు సూచిస్తున్నారు. స‌ర్జిక‌ల్ దాడుల‌ను గురించి ఆరోప‌ణ‌లు చేస్తుంటే దేశం మీదే చేస్తున్న‌ట్లు గా అభివ‌ర్ణిస్తున్నారు.

    Surgical Strike

    మ‌రోవైపు కేసీఆర్ కు మ‌తిభ్ర‌మించింద‌ని ఎద్దేవా చేస్తున్నారు. అభినంద‌న్ వ్య‌వ‌హారం కూడా క‌నిపించ‌లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌పంచం మొత్తం స్పందించినా మ‌న దేశ‌స్తుల‌కే సంశ‌యం వ‌స్తుంటే వారికి మెద‌డు ప‌ని చేస్తుందా? లేక వారు కావాల‌నే అప్ర‌దిష్ట ఆపాదిస్తున్నారా అంతుచిక్క‌డం లేదు. స‌ర్జిక‌ల్ దాడుల విష‌యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అనుమానాల‌కు కేసీఆర్ వంత పాడుతున్నారు. దీంతో ఇద్ద‌రి అభిప్రాయాల‌ను దేశ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

    స‌ర్జిక‌ల్ దాడులను సైతం రాజ‌కీయం చేయాల‌ని చూడ‌టం వారి అనైతిక‌త‌కే ఆజ్యం పోస్తుంద‌ని బీజేపీ నేత‌లు సైతం ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ నేత‌ల అనుమానాలు రావ‌డంలో ఆంత‌ర్య‌మేమిటో కూడా తెలియ‌డం లేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. దేశానికి సంబంధించిన అంశాల్లో కూడా ఇలా సంశ‌యాలు రావ‌డం స‌మంజ‌సం కాద‌నే వాద‌న వారిలో వ‌స్తోంది.

    Also Read: తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మేనా?

    సైనిక చ‌ర్య‌ల‌ను అవ‌మానిస్తూ రాహుల్ గాంధీ, కేసీఆర్ ఏం సాధిస్తున్నారో తెలియ‌డం లేదు. దేశం కోసం సైనికులు త్యాగాలు చేస్తుంటే మ‌న రాజ‌కీయాలు ఇలా దిగ‌జార‌డం చూస్తుంటే వారిలో దేశ‌భ‌క్తి ఉందా? లేదా అని ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌ర్జిక‌ల్ దాడులు తెచ్చిన‌వా? వ‌చ్చిన‌వా? అని మ‌న నేత‌ల‌కు ఏ ర‌కంగా ఆలోచ‌న వ‌స్తుందో కూడా అవ‌గ‌తం కావ‌డం లేదు. స‌ర్జిక‌ల్ దాడుల విష‌యంలో ఎందుకు రాజ‌కీయం చేస్తున్నారో కూడా ఎవ‌రికి కూడా అర్థం కావ‌డం లేదు.

    దీంతో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకుని దాని ప్ర‌తిష్ట దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశంతోనే ఇలాంటి చౌక‌బారు ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నార‌ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు వ‌స్తున్నాయి. కేసీఆర్ తీరు ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. దేశ‌భక్తి విష‌యంలో ఇలా చేయ‌డం క‌రెక్టు కాద‌నే వాద‌న‌లు బ‌లంగా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో త‌న పాత్ర పోషించాల‌ని చూస్తున్న కేసీఆర్ కు ఇంత సంకుచిత మ‌న‌స్త‌త్వం ఉంటుందా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై బీజేపీ కూడా కేసీఆర్ ల‌క్ష్యంగా స‌ర్జిక‌ల్ దాడులు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

    Also Read: KCR Chinajiyar: చినజీయర్ స్వామిపై కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?

    Tags