
తెలంగాణ, ఏపీలలో రాజకీయ వేడి కలుగుతోంది. ఇప్పటికే సగం పాలన పూర్తి చేసుకున్న రెండు రాష్ర్టాలు ఒక సంవత్సరం తేడాతో ఎన్నికలకు వెళ్లనున్నాయి. కేసీఆర్ కు రెండేళ్లు, జగన్ కు మూడేళ్ల సమయం ఉంది. చివరి ఏడాది లె క్కలోక తీసుకోకపోరు. పదవీ కాలం ఏడాదిలో పూర్తవుతుందని అనగా ఎన్నికల హడావుడి నెలకొంటుంది. దీంతో ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో పలు మార్గాలు ఎంచుకుంటుంది. ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
రెండేళ్లలో ఏం పనులు చేయాలనే దానిపై సమాలోచనలు చేసి విజయం కోసం పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటారు. ప్రజల కోసం ఏం చేయబోతున్నదానిపై స్పష్టత ఇస్తారు. జనం మెచ్చే పథకాల కోసం రూపకల్పన చేసేందుకు కార్యాచరణ అమలు చేసేందుకు ముందుకు కదులుతారు. సామాజిక వర్గాల వారీగా ఏ విధంగా ఆకర్షించేలా మేనిఫెస్టో తయారు చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు కార్యోన్ముఖులవుతారు.
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్బంలో సీఎం జగన్ చెప్పారు. వచ్చే రెండున్నరేళ్లలో మంత్రుల శాఖలు మారతాయని చెప్పారు. అదే ఎన్నికల కేబినె ట్ అవుతుంది. జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మీడియాలో జరుగుతున్న చర్చల్లో ఏపీలో అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు. జగన్ చేసే పనుల్లో పారదర్శకత లేదని పలువురు ఆరోపణలు చేస్తున్నా వాస్తవంలో పరిస్థితి మరోలా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో ఏదైనా చేసి రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు శ్రద్ధ చూపుతామని చె ప్పారు. ప్రజలకు ఉఫాధి దొరకాలంటే పరిశ్రమల ఏర్పాటు అవసరమని గుర్తించారు. ప్రజల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.