
కేసీఆర్ నిర్ణయాలు ఎవరికి అంతుబట్టవు. ఆయన ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. ఎ ప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో? ఎవరిని ఎప్పుడు పంపిస్తారో తెలియదు. అలాంటి నైజం కేసీఆర్ ది. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భవితవ్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన పదవీకాలం త్వరలో పూర్తి కావస్తున్న సందర్భంగా మరోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారా? లేదా అనే విషయం చర్చనీయాంశమైంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు. మంత్రి పదవి కావాలని కోరిక. అయితే ఆయనను ఎమ్మెల్సీ చేసి శాసనమండలి చైర్మన్ పదవి కట్టబెట్టారు. కేబినెట్ ర్యాంకు పదవి కావడంతో గుత్తా ఖుషీగానే ఉన్నారు. ఆయన పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. సుఖేందర్ రె డ్డితో పాటు నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్ల పదవీకాలం పూర్తవుతుంది.
వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. మరోసారి వీరికి ప్రాధాన్యత ఇస్తారా? టీఆర్ఎస్ కు తొలి నుంచి పనిచేస్తున్న వారికి కేసీఆర్ పదవులు ఇస్తారా? ఇప్పటికే ఈటల రాజేందర్ ఊరూరా తిరిగి ఉద్యమంలో పాల్గొన్న వారికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా పార్టీలు మారి వచ్చిన వారికి తిరిగి రెన్యవల్ చేస్తాా? లేదా? అన్నది సందేహంగా ఉంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పీవీ కుమార్తె సురభి వాణిదేవిని నియమిస్తారన్నప్రచారం ఎటూ ఉండనే ఉ:ది. దీంతో గుత్తా సుఖేందర్ రె డ్డిని శాసనమండలి చైర్మన్ పదవిలో కొనసాగించడం కష్టమేనంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణలు చూస్తే గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.